modi | sushma Swaraj | Lalith modi

Modi strategic silence on sushma swaraj episode

modi, sushma Swaraj, Lalith modi, Sushma swaraj in Rajyasabha, Parliament, Modi silence, NDA

Modi strategic silence on sushma swaraj episode. Congress and other opposite leaders demand for resignation of sushma but modi still maintaining silence on sushma episode.

సుష్మా ఎపిసోడ్ పై మోదీ మౌనం

Posted: 08/13/2015 08:46 AM IST
Modi strategic silence on sushma swaraj episode

లలిత్ మోడీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నట్లు? ప్రతిపక్షాల దాడికి తనదైన శైలిలో ఎందుకు జవాబివ్వలేకపోతున్నారు. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్న దశలో సుష్మా స్వరాజ్ లలిత్ మోడీ వివాదంపై ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం లేదెందుకు? లలిత్ మోడీ వివాదంలో ఇప్పుడు ప్రతిపక్షాలు సంధిస్తున్న అస్త్రాలివే? గత కొన్ని రోజులుగా ఈ వివాదం ముదిరి పాకానపడుతోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్రమోడీమీదకే ఈ అంశం చేరుకుంటోంది. సుష్మాస్వరాజ్ విషయం తేల్చకపోతే ప్రధానే రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా ప్రతిపక్షాలు తీసుకువస్తున్నాయి.

నరేంద్రమోడీ మన్ కీ బాత్ లో లలిత్ మోడీ అంశంపై జవాబిస్తారనుకున్నాం... ఆయన నిజాల్ని దాస్తున్నారు అని మొదట్లోనే ఆప్ ప్రధానినే నేరుగా తప్పుపట్టింది.గతంలో నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద వచ్చిన ఆరోపణలతో రాజీనామా డిమాండ్ అప్పట్లో వచ్చింది. దీన్ని ఎల్కే అద్వానీ వంటి నేతలు సరిదిద్ది పార్టీ నుంచి వ్యతిరేకత లేకుండా జాగ్రత్తగా నరేంద్రమోడీకి దారి సరిచేశారు..దాదాపు ఇప్పుడు అదే పరిస్థితి సుష్మా వివాదంలో వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modi  sushma Swaraj  Lalith modi  Sushma swaraj in Rajyasabha  Parliament  Modi silence  NDA  

Other Articles