anothet Twist in vote for note case

Another turn in vote for note case and mathaiah case

cash on vote, nara lokesh, cash on vote, phone tapping, media, KTR, mathiah jerusalem, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Telangana acb officials serves notice to Nara lokesh driver, while AP cid police gives notices to minister KTR driver and gunman

వారసుల డ్రైవర్ల మెడకు బిగుసుకుంటున్న కేసులు

Posted: 08/12/2015 09:29 PM IST
Another turn in vote for note case and mathaiah case

తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఓటుకు నోటు కేసు, దానికి ప్రతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు, ముత్తయ్య పిర్యాదుతో నమోదు చేసిన కేసులు మరో కీలక మలుపు తిరగనున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారసుల వ్యక్తిగత మనుషుల చుట్టూ ఈ కేసు బిగుసుకోనుంది. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో టీడీపీ యువనేత నారా లోకేష్‌ డ్రైవరు కొండల్‌రెడ్డిని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి కొండల్ రెడ్డిని ఏసీబి అధికారులు విచారించనున్నారు. కొండల్‌రెడ్డి కోసం మంగళవారం టీడీపీ ఆఫీసుకు ఏసీబీ అధికారులు వెళ్లారు. ఆఫీసులో కొండల్‌రెడ్డి లేకపోవడంతో అధికారులు వెనుదిరిగారు. ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్‌ గన్‌మెన్‌లతో కొండల్‌రెడ్డి తరచూ మాట్లాడారని ఏసీబీ అధికారులు చెప్పారు. దీంతో ఇవాళ కొండల్‌రెడ్డికి విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబి అధికారులు 160 సీఆర్పీపీసీ కింద నోటీసులు జారీ చేశారు.

మరోవైపు జెరూసలెం మత్తయ్యను బెదిరించిన కేసులో నోటీసులు జారీ చేసుందుకు ఏపీ సీఐడీ రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ గన్ మెన్ సత్యనారాయణతో పాటు డ్రైవర్లకు సీఐడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో మత్తయ్యను వీరిద్దరు ఫోన్ ద్వారా బెదిరించారని మత్తయ్య అరోపించినట్లు సమాచారం. దీంతో ఈ నెల 14న విజయవాడకు విచారణ నిమిత్తం హాజరుకావాలని ఏపీ సిఐడి పోలీసులు నోటీసులలో పేర్కోన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారని తెలుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  cash on vote  phone tapping  media  KTR  mathiah jerusalem  

Other Articles