Sushma Swaraj says she has done nothing wrong in lalit gate

Sushma mocks rahul says cong helped quattrocchi and anderson

Sushma Swaraj, Rahul Gandhi, Ottavio Quattrocchi, Warren Anderson, Bofors, rajiv gandhi, lalit modi, lok sabha, congress, sumitra mahajan, parliament live, lok sabha live, lalit modi controversy, venkaiah naidu, lalit gate, parliament, Narendra modi, sonia gandhi, arun jaitley

Minister of External Affairs, Sushma Swaraj speaks in the Lok Sabha in New Delhi. Swaraj said there was no wrongdoing on her part, and that she was only helping Modi's wife who is a cancer patient on humanitarian grounds.

పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ పై సుష్మాస్వరాజ్ ఎదురుదాడి..

Posted: 08/12/2015 04:42 PM IST
Sushma mocks rahul says cong helped quattrocchi and anderson

ఆర్థిక నేరస్థుడిగా అభియోగాలను ఎదుర్కోంటున్న లలిత్ మోడీ వ్యవహారంలో తాను న్యాయం అడుగుతున్నానని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. లలిత్ మోడీ వ్యవహారంలో తాను మోదీకి సహకరించారన్న అంశంలో చర్చ సందర్భంగా లోక్ సభ దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చను ప్రారంభించిన విపక్ష్ నేత మల్లిఖార్జున్ ఖార్గే.. సుష్మాపై పలు ఆరోపణలు సందించారు.. ఆ తరువాత చర్చలో భాగంగా కేంద్ర మంత్రి సుష్మా సర్వాజ్ మాట్లాడేందుకు స్పీకర్ ను అనుమతినివ్వడంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. గందరగోళం మధ్యే సుష్మా సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రసంగంలో కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ హాయంలో సాగిన కుంభకోణాలన్నింటినీ గుర్తుచేశారు.

లలిత్: మోడీ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆయనకు అనుకూలంగా సిఫార్సు చేశానని కాంగ్రెస్ నేతల అభియోగాలను అమె తిప్పుకోట్టారు. ఒక భారత మహిళకు సాయం చేశాను. 17 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతోందని ఆమెపై ఎలాంటి కేసులు లేవని.. ఆపరేషన్ చేయడం వల్ల ఆమెకు ప్రమాదం తప్పే అవకాశం ఉందని అమె అన్నారు. ఇది నేరమై అయితే తాను నేరం చేశానని అంగీకరిస్తానన్నారు.. లలిత్ మోడీ దస్తా వేజులను పరిశీలించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరానని, నియమ నిబంధనల ప్రకారమే దస్తావేజులను ఇవ్వడం జరిగిందని అక్కడి ప్రభుత్వం పేర్కొందని  తన కుటుంబసభ్యులపై ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.. పాస్ పోర్టు వ్యవహారంలో తన భర్త పాత్ర లేదన్నారు.. అందులో 11 మంది న్యాయవాదులున్నారని... ఇక్కడ తన కుమార్తె జూనియర్ న్యాయవాది. ఎక్కడైనా జూ.న్యాయవాదికి డబ్బులు ఇస్తారా ? తన భర్త..తన కుమార్తె ఒక్క పైసా కూడా తీసుకోలేదని తెలిపారు.

సుష్మా క్రిమినల్ యాక్ట్ చేశారని బయట రాహుల్ గాంధీ పేర్కొంటున్నారని అయితే తాను ఏ పనిని రహస్యంగా చేయలేదని తనను తాను సమర్థించుకున్నారు. ఇక కాంగ్రెస్ పై ఎదురుదాడికి దిగారు. గతంలో ఆర్థిక మంత్రి చిదంబరం సతీమణి, సీనియర్ న్యాయవాది నళిని ఆదాయం పన్ను శాఖ తరపున కేసులు వాదిస్తున్న వ్యవహారంపై గందరగోళం చెలరేగిందని గుర్తు చేశారు. .ఖత్రోచి పారిపోవడానికి ఎవరు సహాయం చేశారని అమె ప్రశ్నించారు ? అర్జున్ సింగ్ ఆటోబయోగ్రఫీలో అనేక విషయాలున్నాయని...15వేల మంది మరణానికి కారణం అండర్ సన్ ను దేశం దాటించింది కాంగ్రెస్ నాయకత్వ కాదా..? ఈ విషయంలో క్విడ్ ప్రోకో ప్రకారమే యాండర్సన్ ను దేశం దాటించారని అమె నిలదీశారు. శారదా స్కాంలో నిందితుల తరపున చిదంబరం భార్య నళినీ వాదించారని. నళినీ చిదంబరం కోటి రూపాయలు తీసుకున్నారని కూడా గుర్తు చేశారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles