Parliament | Congress | BJP | Venkiah Naidu

Venkiah naidu said that its if they dont come

parliament, Congress, BJP, Venkiah Naidu, Suspension

Venkiah Naidu said that its if they dont come. In Parliament said that those Mps who suspended from Parliament, He said that its better if they dont come to the Parliament.

వాళ్లు రాకపోతేనే బెటర్ అంటున్న వెంకయ్య నాయుడు

Posted: 08/08/2015 01:59 PM IST
Venkiah naidu said that its if they dont come

లోక్‌సభ నుంచి 25 మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయటాన్ని నిరసిస్తూ విపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), వామపక్ష పార్టీల సభ్యులు శుక్రవారం కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. సస్పెన్షన్‌ను ఎత్తేయాలన్న వారి డిమాండ్లను స్పీకర్ పట్టించుకోకపోవటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. దాంతో విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే క్విట్ ఇండి యా ఉద్యమ అమరులకు సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు.

ఆ వెంటనే ఎస్పీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్, ఆర్జేడీ ఎంపీ జయప్రకాశ్‌నారాయణ్‌యాదవ్‌లు ఎంపీల సస్పెన్షన్ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించారు. వారికి లెఫ్ట్ పార్టీ సభ్యులు కూడా తోడయ్యారు. ఈ సమయంలో మంత్రి వెంకయ్య నాయుడు కలుగజేసుకొని విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేస్తే వారు సభా కార్యకలాపాలకు సహరిస్తారని మీరు హామీ ఇవ్వగలరా? సభను బాయ్‌కాట్ చేసినవారి ప్రవర్తన ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంది. వాళ్లు వెళ్లిపోయినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపారు. మంత్రి ప్రకటనపై ఎస్పీ, ఆర్జేడీ సభ్యులు తీవ్రం అభ్యంతరం తెలిపారు. మరి వెంకయ్య నాయుడు సభలో ఎవరూ లేకుండా.. పార్లమెంట్ లోకి ఎవరూ రాకుండా ఉంటే ఎలా సభలను నడుపుతారో మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parliament  Congress  BJP  Venkiah Naidu  Suspension  

Other Articles