Five Maggi samples fail laboratory test

Maggi samples fail test in lucknow laboratory official

instant snack maggi, permissible limit, FSSAI, RamVilas Paswan, Nestle, lead, mono sodium glutamate, PM narendra modi, foreign investors, ban on maggi, Food Safety Standards Authority of India, Food Safety, Bombay high court, indian peoples health

Five more samples of instant snack Maggi have failed tests at a laboratory here as they contained lead content beyond the permissible limit, an official said on Saturday.

మళ్లీ ఫెయిల్ అయిన మ్యాగీ.. ల్యాబ్ పరీక్షల్లో వెల్లడి..

Posted: 08/08/2015 12:48 PM IST
Maggi samples fail test in lucknow laboratory official

విదేశీ పెట్టుబడి దారులు వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో నెస్ట్లీ వంటి ప్రతిష్మాత్మక కంపెనీల ఉత్పదనలను ఎలాంటి రభస చేయకుండా చూడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనను ఆదేశించారని స్వయంగా కేంద్ర పౌరశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ప్రకటించిన రెండు రోజుల్లో నెస్ట్లీ కంపెనీ ఉత్పాదన మ్యాగీ నూడుల్స్ ప్రజారోగ్యానికి విఘాతం కలిగించేలా వుందని మరోమారు వెల్లడైంది. బిజేపి పాలిత రాష్ట్రం గోవాలో మ్యాగీ శాంపిల్స్ ను ల్యాబ్ లో పరీక్షించామని.. అవి తినడానికి సురక్షితమేనని వెల్లడైందని, ఈ నేపథ్యంలో బ్యాన్ విధింపుపై పునరాలోచనలో వున్నామని కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ వెల్లడించిన వివరాలను సందిగ్ధంలోకి నెడుతూ తాజా ఫలితాలు వెల్లడయ్యాయి.

తాజాగా, మ్యాగీ శ్యాంపుల్స్ సురక్షితం కాదని మరో ల్యాబ్ పరీక్షలో తేలింది. మ్యాగీ శాంపిల్స్ను ల్యాబ్లో పరీక్షించగా, మోతాదుకు మించి సీసం వాడారని తేలినట్టు శనివారం ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ నిర్ణయించిన మోతాదుకన్నా సీసం మోతాదు ఎక్కువగా ఉందని ఆ అధికారి తెలిపారు. మ్యాగీ శాంపిల్స్ను పరీక్షించిన ల్యాబ్ రిపోర్టులను భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థకు పంపనున్నట్టు అడిషనల్ కమిషనర్(ఫుడ్) మౌర్యా పేర్కొన్నారు. సీసం, మోనోసోడియం గ్లుటామేట్ మోతాదుకు మించి వున్నాయన్న కారణంగానే కేంద్రం మ్యాగీపై జూన్ 5న నిషేదం విధించిన విషయం తెలిసిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : instant snack maggi  permissible limit  FSSAI  RamVilas Paswan  Nestle  

Other Articles