Google | Doodle | Mont Blanc

Google memorializes first ascent to mont blanc

Google, Doodle, Mont Blanc, Doctor Michel Paccard, Jacques Balmat

Google Memorializes First Ascent to Mont Blanc On 8 August 1786 Jacques Balmat along with Doctor Michel Paccard, both from Chamonix, did the first ever recorded ascent to Mont Blanc. Google memorializes the 229th anniversary of the historic climb to the "White Mountain" by a frosty google doodle.

గూగుల్ తాజా మౌంట్ బ్లాంక్ డూడుల్

Posted: 08/08/2015 08:26 AM IST
Google memorializes first ascent to mont blanc

ఫ్రాన్స్‌లోని మౌంట్ బ్లాంక్ పర్వతారోహరణ మొదటిసారి జరిగి నేటికి 229 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ తన డూడుల్‌ను మార్చింది. ఫ్రాన్స్, స్విట్జల్యాండ్, ఇటలీ మూడు ప్రాంతాల సరిహద్దుల్లో మౌంట్ బ్లాంక్ ఉంది. డాక్టర్ మైకేల్ పక్కార్డ్‌తో పాటు జాక్వెస్ బల్‌మత్ అనే ఇద్దరు నల్లజాతీయులు 8ఆగస్టు, 1786న మొదటిసారిగా ఈ మౌంట్ బ్లాంక్ పర్వతారోహణ చేశారు. ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ గూగుల్ తన డూడుల్‌ను మార్చింది.

మౌంట్ బ్లాంక్‌ను అధిరోహిస్తున్న ఇద్దరు నల్లజాతీయులు పర్వత శిఖరం పై భాగానికి చేరుకుంటున్నట్లుగా చూపింది. అదేవిధంగా పర్వతపాద ప్రాంతంలో అడవులను తీర్చిదిద్దింది. తెల్లని పర్వతాన్ని మొత్తంగా కమ్మేస్తున్నట్లు మేఘాల తెల్లని నీడలు పరుచుకున్నట్లుగా ఉంచింది. ఇతర చిన్న పర్వతాలను కూడా పర్వత ముందు భాగంలో చూడవచ్చు. డూడుల్‌పై ఒక్కసారి క్లిక్‌చేస్తే మౌంట్ బ్లాంక్ సెర్చ్ పేజీకి తీసుకువెళ్తుంది. మౌంట్ బ్లాంక్ అంటే అర్థం తెల్లని పర్వతం అని. ఆల్ఫ్ పర్వతాల్లో అదేవిధంగా యూరప్‌లో ఇదే అంత్యంత ఎత్తైనది. సముద్ర మట్టానికి 4,807 మీటర్ల (15,771 ఫీట్లు) ఎత్తులో ఉంది. ఎత్తులో ఈ పర్వతం ప్రపంచంలో 11వ స్థానంలో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  Doodle  Mont Blanc  Doctor Michel Paccard  Jacques Balmat  

Other Articles