KG to PG | Free Education | Kadiyam Srihari

Telangana dept cm kadium srihari told that kg to pg free education from next acadamic year

Telangana,, KG to PG, Free Education, Gurukulas, Kadium SriHari, Telangana CM, KCR

Telangana Dept CM Kadium Srihari told that KG to PG free education from next acadamic year. Telangana cm KCR agree to establish 1190 gurukulas in the state he added.

వచ్చే ఏడాది నుండి కేజీ టు పీజీ ఉచిత విద్య

Posted: 08/08/2015 08:20 AM IST
Telangana dept cm kadium srihari told that kg to pg free education from next acadamic year

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య మీద ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అయితే వచ్చే ఏడాది నుంచే  కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానాన్ని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ విద్యా విధానాన్ని మూడు విభాగాలుగా విభజించామని చెప్పారు. మొదటిది కేజీ టు 4వ తరగతి, రెండోది 5 నుంచి 12వ తరగతి, మూడోది 12వ తరగతి తర్వాత విద్యగా విభజించామన్నారు. కేజీ టు పీజీ కోసం రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 చొప్పున 1,190 గురుకులాల ఏర్పాటుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు అమోదం తెలిపారని వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రంలోని గురుకులాలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకొస్తున్నామని తెలిపారు. గురుకులాల నిర్వహణ కోసం విద్యాశాఖ పరిధిలో ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటుచేసేందుకు సీఎం అమోదం తెలిపారని చెప్పారు.

దేశంలో మొదటిసారిగా తెలంగాణలోనే హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని కడియం శ్రీహరి తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే బియ్యం కొలతల రూపంలో కాకుండా కడుపునిండా అన్నం పెట్టాలని సీఎం కేసీఆర్ భావించారని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పేద విద్యార్థులకు కడుపునిండా అన్నం పెట్టేందుకు సన్నబియ్యం పంపిణీ కోసం పౌరసరఫరాలశాఖ అధికారులకు ఇండెంట్ పెట్టాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో మెస్‌ఛార్జీలు ఒకేవిధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వారికి రూ.5 లక్షల వరకు సబ్సీడీ రుణాలు ఇస్తున్నామన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీకోసం భూమి కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని కడియం పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  KG to PG  Free Education  Gurukulas  Kadium SriHari  Telangana CM  KCR  

Other Articles