uttar pradesh husband helps wife marry lover, sees her off with gifts

Husband kanyadhans wife to lover

husband kanyadhans wife to lover, Man helps wife marry lover, Faizabad, Bollywood romantic love story, Uttar pradesh, husband, wife, lover, marriage, gift, kanyadhan, lover

Besides throwing out a lavish lunch, Phoolchand and his family members also gave gifts to the newly wed at the time of `Vidai.

భార్యకు కన్యాధానం చేసిన భర్త.. ప్రియుడితో వివాహం

Posted: 08/07/2015 10:58 PM IST
Husband kanyadhans wife to lover

తెలుగులో స్వర్గీయ ఇవివి సత్యనారాయణ రూపోందించిన చిత్రం కన్యాదానం.. అచ్చం అలాంటి కథను తలపించిందచి ఇతగాడి జీవితకథ. అయితే తన భార్య మనస్సును తెలుసుకుని అలానే చేసి సినిమాలో మాదిరిగానే కథను సుఖాంతం చేశాడు. ఉత్తరప్రదేశ్లోని  ఫైజాబాద్కు చెందిన పూల్ చంద్.. మూడేళ్ల తరువాత భార్యను కలుసుకోవాలని  ఎంతో ఆతృతగా  సొంత ఊరుకి రాగా.. అతని భార్య చందా పెద్ద షాకిచ్చింది.  దీంతో అతనికి ఆవేశం పొంగుకొచ్చింది.   అయితే ఆవేశాన్ని అణచుకొని స్థిమితంగా ఆలోచించాడు...  తమ మధ్య నెలకొన్న సంక్షోభానికి చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నాడు....  అంతేనా..... కుటుంబ సభ్యుల్ని,  గ్రామ పెద్దల్ని ఒప్పించాడు. .. ఇంతకీ భార్య ఇచ్చిన షాక్  ఏంటి?  ఏమిటా పరిష్కారం...?. అందర్నీ ఎలా ఒప్పించాడంటే...

వివరాల్లోకి వెడితే ఫైజాబాద్కు చెందిన  పూల్ చంద్ పెద్దలు కుదిర్చి పెళ్లి చేసుకున్నాడు.  సంతోషంగా భార్య చందాను  కాపురానికి తీసుకు వచ్చాడు.  ఆ  తర్వాత  ఉద్యోగరీత్యా జలంధర్కు  వెళ్ళిపోయాడు.   ఫోన్లో మాత్రమే భార్యాభర్తలిద్దరూ తరచూ మాట్లాడుకునేవారు.   అయితే కొన్నాళ్ల తరువాత ఇంటికి వచ్చిన అతనికి భార్య చందా షాకింగ్ న్యూస్ చెప్పింది.   తాను వేరే వ్యక్తిని ఇష్టపడుతున్నానంటూ బాంబు పేల్చింది.  కేవలం పెద్దల కోసమే   పెళ్లి చేసుకున్నానని... ఇక తన  వల్ల కాదని తేల్చిచెప్పింది.   దీంతోపాటూ పెళ్లి సమయంలో తనకు పెట్టిన నగలు, బట్టలు అన్నీ అతనికి  తిరిగి ఇచ్చేసింది.  పూల్చంద్తో కలిసి కాపురం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. దీంతో పూల్ చంద్ హతాశుడయ్యాడు.  అందరిలాగానే అతడు కూడా  చాలా  ఆవేశానికి  లోనయ్యాడు.

అయితే... భార్య నిజాయితీగా వ్యవహరించిన తీరు తనని ఆకట్టుకుందని పూల్చంద్ తెలిపాడు.  పెళ్లికి ముందే  చందా, సూరజ్ ప్రేమించుకున్నారని,   అందుకే ఎలాగైనా  వారికి న్యాయం చేయాలని భావించానని చెప్పాడు.  తమ పెళ్లి మూలంగా విడిపోయిన ప్రేమికుల్ని తిరిగి కలపాలనే ఉద్దేశంతోనే కష్టపడి  తమ కుటుంబసభ్యులను, గ్రామ పెద్దలను ఒప్పించినట్లు పూల్చంద్ వెల్లడించాడు.  దీంతో గ్రామపెద్దల సమక్షంలో చందాకు కోరుకున్న ప్రియుడితో అంగరంగ  వైభవంగా  వివాహం జరిపించడమే కాకుండా,  కానుకలతో అత్తారింటికి సాగనంపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar pradesh  husband  wife  lover  marriage  gift  

Other Articles