Telangana cm kcr approves new liquor policy

Telangana cm kcr review on new liquor policy

Telangana cm kcr approves new liquor policy, Telangana chief minister KCR, Kalvakuntla chandrashekar Rao, Telangana, New Liquor policy, approves, KCR,october first excise department, cheap liquor,

Telangana chief minister Kalvakuntla chandrashekar Rao approves new liquor policy after review, which starts from october first

తెలంగాణ కోత్త మద్యం పాలసీపై కేసీఆర్ సమీక్ష

Posted: 08/07/2015 10:32 PM IST
Telangana cm kcr review on new liquor policy

తెలంగాణ ఎక్సైజ్ అధికారులు రూపొందించిన సరికొత్త మద్యం పాలసీకీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమోదం లభించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అటు గుడుంబా, ఇటు బెల్ట్ షాపులను అరికట్టడంతోపాటు, ఖజానాకు భారీగా కాసుల కురిపించే కొత్త మద్యం పాలసీ అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది. అయితే అధిక ఆదాయాన్ని రాబట్టే హైదరాబాద్ లో మరో నూతన పాలసీని అమలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపిందని సమాచారం. సాధరణంగా దసరా పండగ ముందు నుంచి నూతన పాలసీ అమల్లోకి రావడం అనవాయితీగా మారింది.

అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతున్న కొత్త మద్యం పాలసీకి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అమోదం లభించింది. ఈ మేరకు ఆయన ఇవాళ నూతన మద్యం పాలసీపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన మద్యం పాలసీకి కేసీఆర్‌ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ కొత్త పాలసీలో గుడుంబా నిర్మూలన, బెల్టు పాఫులు లేకుండా చేయడమే ప్రధాన ధ్యేయంగా ఉంటుందని ఆయన వివరించారు. నెలాఖరులోగా మద్యం దుకాణాలకు  టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.

చీప్‌ లిక్కర్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరలోనే ఆల్కహాల్‌ పర్సంటేజీపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ వివరించారు. ప్రభుత్వ కొత్త మద్యం పాలసీతో రాష్ట్ర ఖజానాకు అదాయం తగ్గినా..  పర్వాలేదు కానీ, ప్రజల ఆరోగ్యానికి మాత్రం భద్రత కల్పించేలా ఉంటుందన్నారు. మండలాన్ని యూనిట్ గా చేసి చీఫ్ లిక్కర్  లైస్సెన్సులు జారీ చేస్తామని కేసీఆర్ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  New Liquor policy  approves  KCR  

Other Articles