TSPSC | Telangana | Jobs | Notification

Tspsc may announce the syllabus for new job notification with in ten days

TSPSC, TPSC, Telangana, Jobs, Notification, Groups, Telangana Notifications, Employement news, Jobs notification

TSPSC may announce the syllabus for new job notification with in ten days. TSPSC officials are trying to announce syllabus as soon as possible.

పది రోజుల్లో టిపీఎస్సీ పరీక్షల సెలబస్..!

Posted: 08/06/2015 08:13 AM IST
Tspsc may announce the syllabus for new job notification with in ten days

తెంలంగాణలో త్వరలో జారీ కానున్న జాబ్ నోటిఫికేషన్ల పరీక్ష మీద ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటి దాకా ఉమ్మడి రాష్ట్రం పరిధిలో చదివిన సిలబస్ ను మారుస్తున్నట్లు టిఎస్పిఎస్సీ ఇప్పటికే వెల్లడించింది. అయితే ఉద్యోగార్థులలో మాత్రం సవాలక్ష  సందేహాలు ఉన్నాయి. సెలబస్ ఏంటి.? తెలంగాణ చరిత్ర కోసం ఎలాంటి పుస్తకాలు చదవాలి..? ఎగ్జామ్ ప్యాట్రన్ ఏంటి..? ఇలా చాలా ప్రశ్నలు నిరుద్యోగులను సతమతం చేస్తున్నాయి. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా టీఎస్‌పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. సిలబస్‌లో ఎక్కువ మార్పులు ఉండే గ్రూపు-1, గ్రూపు-2 విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందకుండా కార్యాచరణపై దృష్టి పెట్టింది. చదువుకునే సమయం ఇవ్వడంతోపాటు, పూర్తి స్థాయి సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పరీక్షల విధానం, 15,522 పోస్టుల భర్తీకి ఆమోదం, ఆయా పేపర్లలో ఉండే సిలబస్ ఔట్‌లైన్ ఇచ్చినందున, అందుకనుగుణంగా వారం పది రోజుల్లో పూర్తి సిలబస్‌ను, వాటిల్లోని టాపిక్స్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తేనుంది.

Also Read :  ఏ ఉద్యోగం గ్రూప్ 1లో... ఏ ఉద్యోగం గ్రూప్ 2లో

కాగా మరో ఐదారు రోజుల్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన సిలబస్ రూపకల్పనకు చర్యలు చేపట్టింది. గత నెలలో ప్రభుత్వం వివిధ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన వెంటనే పూర్తి స్థాయి సిలబస్ రూపకల్పనపై టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది. ఇంజనీర్ పోస్టుల్లోనే పది రకాల పోస్టులు ఉండటం, వాట న్నింటికి అవసరమైన సిలబస్ రూపకల్పన చేయిస్తోంది. గత వారం నుంచి పలువురు ప్రొఫెసర్ల నేతృత్వంలో ఇదే పనిలో నిమగ్నమైంది. ఇది పూర్తయ్యేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది.

Also Read :  కొత్తగా మరో 12వేల ఖాళీల భర్తీకి సిద్దం

తెలంగాణ ప్రభుత్వం మొదటి నోటిఫికేషన్లుగా ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయి కసరత్తు చేసిన తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ జారీకి ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ నోటిఫికేషన్ల తరువాత ఇతర శాఖల్లోని పోస్టులకు పూర్తిస్థాయి సిలబస్ రూపొందించి, ఒక్కొక్కటిగా వరుస క్రమంలో నోటిఫికేషన్లను జారీ చేయాలని యోచిస్తోంది. ఇక ఈసారి ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడాన్ని నియంత్రించేందుకు బయోమెట్రిక్ విధానం అమల్లోకి తేవాలని భావిస్తోంది. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకూ ఆలోచనలు చేస్తోంది. ముందు సిలబస్.. తరువాత నోటిఫికేషన్లు వారం పది రోజుల్లో గ్రూపు-1, గ్రూపు-2 తదితర పోస్టుల సిలబస్ ఖరారు చేసి వెబ్‌సైట్‌లో పెట్టేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈనెల 15లోగా సిలబస్ ఇచ్చాక నెలా.. రెండు నెలల సమయమిచ్చి అక్టోబర్‌లో గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేస్తే బాగుంటుందని భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSPSC  TPSC  Telangana  Jobs  Notification  Groups  Telangana Notifications  Employement news  Jobs notification  

Other Articles