UK MP Keith Vaz Request British Govt To Give Back Kohinoor To India | Kohinoor Controversy

British mp request government to give back kohinoor to india narendra modi

Kohinoor, Kohinoor diamond news, Kohinoor controversy, Kohinoor diamond in london, british govt, british mp keith vaz, indian origin mp keith vaz, narendra modi, kakatiya dynasty, medieval dynasty, hindu goddess temple

british mp request government to give back kohinoor to india narendra modi : Indian-origin British MP Keith Vaz on Tuesday called for the world-famous Kohinoor diamond to be returned to India during Prime Minister Narendra Modi's UK visit in November.

మోదీకి ‘కోహినూర్’ ఇచ్చేయండి.. బ్రటిన్ ఎంపీ వినతి

Posted: 07/29/2015 10:35 AM IST
British mp request government to give back kohinoor to india narendra modi

భారతదేశాన్ని 200 వందల సంవత్సరాలు పాలించిన బ్రిటీష్ పాలకులు.. ఇక్కడి నుంచి తిరిగి వెళుతూ ఎంతో విలువైన ‘కోహినూర్’ వజ్రాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. దానిని వెనక్కు తీసుకొచ్చేందుకు భారతీయులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవి ఫలించలేదు. దాంతో అది అక్కడే వుండిపోయింది. అయితే.. ఇప్పుడు తాజాగా ఓ బ్రిటన్ ఎంపీ ఈ వజ్రం తిరిగి భారత్ కు దక్కేలా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఇచ్చేయాలంటూ ఆయన బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు.

భారత సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కీత్ వేజ్.. ఇండియాకు చెందిన కోహినూర్ వజ్రాన్ని ఆ దేశానికి ఇచ్చేయండని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఏడాది నవంబర్ లో బ్రిటన్ రానున్న భారత ప్రధాని నరేంద్రమోదీకి ఆ వజ్రం ఇచ్చి పంపించాల్సిందిగా ఆయన కోరారు. మరి.. ఆయన అభ్యర్థనను బ్రిటన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే! ఇండియాకి బ్రిటన్ తిరిగి కోహినూర్ ఇస్తుందో లేదో తెలీదు కానీ.. ఒకవేళ ఆ వజ్రాన్ని తిరిగి ఇస్తే మాత్రం ఆ సమయం తనతోపాటు భారతీయులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కీత్ వేజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్ లో తన పర్యటన ముగించుకుని మోదీ తిరిగి కోహినూర్ వజ్రంతో తిరిగి వెళ్లే ఆ ఘడియల్ని ఊహిస్తుంటే చాలా ఎగ్జైట్ మెంట్ వుందని ఆయన పేర్కొంటున్నాడు. కానీ.. ఎవరెన్ని ప్రయత్నాలు చేసుకున్నా.. బ్రిటన్ మాత్రం ఆ వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఇవ్వదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ వజ్రం తీసుకెళ్లినప్పటి నుంచి తమకు అదృష్టం వరించిందని బ్రిటన్ భావిస్తోందని.. దానిని భారత్ తిరిగి ఇచ్చే ఆలోచన ఆ ప్రభుత్వానికి లేదని తేల్చి చెబుతున్నారు.

ఇదిలావుండగా.. నిజానికి ఈ కోహినూర్ వజ్రం కాకతీయుల సామ్రాజ్యానికి చెందింది. ఆనాడు వారు నిర్మించిన ఓ ఆలయంలోని ఓ దేవత విగ్రహానికి ఈ వజ్రాలను కళ్లుగా అమర్చారు. ఇక అక్కడినుంచి రకరకాల సామ్రాజ్యాల చేతుల్లో మారుతూ వచ్చిన ఈ వజ్రం.. మెడీవల్ రాజుల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కొల్లూర్ మైన్ లో లభించాయి. అక్కడి తవ్వకాల్లో లభించిన ఈ వజ్రం విలువ తెలుసుకున్న బ్రిటీష్ పాలకులు.. తమ వెంట దీనిని తీసుకెళ్లిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kohinoor diamond  british mp keith vaz  Kakatiya Dynasty  

Other Articles