Support | Rishitheshwari | Nagarjuna University | Rishitheshwari mystery, AP, Govt, Chandrababu naidu. Babu Rao, Rithekeshwari suicide

Support rithikeshwari family and demand for justice

Rishitheshwari, Nagarjuna University, Rishitheshwari mystery, AP, Govt, Chandrababu naidu. Babu Rao, Rithekeshwari suicide

support Rithikeshwari family and demand for justice. Lets campaign to support Rithekeshwari and govt has to take strict actions on all universities By the suicide of Rithekeshwari.

మరో రిషితేశ్వరి ఆత్మహత్యను ఆపుదాం

Posted: 07/27/2015 12:24 PM IST
Support rithikeshwari family and demand for justice

నిండు ప్రాణం రక్తదాహానికి బలైపోయింది... విద్యార్థులే ప్రాణం తీసిన పాపానికి కారకులయ్యారు. ఎన్నో ఆశలతో.. గొప్ప ఆశయాలతో క్యాంపస్ లో అడుగుపెట్టిన చదువుల తల్లికి తోటి విద్యార్థులే కాలయములయ్యారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటిలో చోటుచేసుకున్న రిషితేశ్వరి ఆత్మహత్య అందరికి బాధ కలిగించింది. తను చివరగా రాసిన సూసైడ్ లెటర్ చదవిన వారికెవరికైనా కంట్లో నీళ్లు రావాల్సిందే. నాన్నా.. చదవుకోవాలని ఎంతో ఆశగా ఉంది కానీ ఈ నరకయాతన భరించలేకపోతున్నా.. నాన్నా నన్ను క్షమించండి అంటూ రాసిన ఆ లెటర్ చదివిన ఎవరికైనా హృదయం చలించాల్సిందే. ఇక రితికేశ్వరికి జరిగిన అన్యాయం మీద అందరూ స్పందిస్తున్నారు. ఆమెకు న్యాయం చెయ్యాలని పిడికిలి బిగిస్తున్నారు.

Also Read:  రిషితేశ్వరి ఆత్మహత్య - ఎన్నో ప్రశ్నలు

"మేం తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తాం.." ఒక్కోసారి మాకు రిషి ఫోన్ చేసి "నైట్ 2-3 గంటల పాటు కంటిన్యూస్ గా టార్చర్ చెస్తున్నారు" అని చెప్పేది అంటూ రిషితేశ్వరి తల్లిదండ్రులు చెబుతుంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తమ కూతురుని రూం ఖాళీ చెయ్యమంటున్నారని... మొత్తం వ్యవహారం మీద ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేద్దామంటే కనీసం కలవకపోవడం నిజంగా పాశవీయం. ఓ ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యంగా విద్యార్థుల సాదకబాధలను పట్టించుకోవాల్సింది పోయి.. విఐపిలాగా అంటీముట్టనట్లు ఉండటం సిగ్గుచేటు. రిషితేశ్వరి ప్రాణాలను ఎలాగూ తిరిగి తీసుకురాలేరు కానీ మరో రిషితేశ్వరి ప్రాణాలు పోకుండా కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది ప్రశ్న.

Also Read:  వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య వెనుక రియల్ మిస్టరీ ఇదే!

నిజానికి రిషితేశ్వరిది ఆత్మహత్య కాదు... ముమ్మాటికి హత్యే. తోటి విద్యార్థులు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తే, దానికి వార్డెన్, ప్రిన్సిపాల్ సహకరించడం ఆమెను ఆత్మహత్య వైపుకు మళ్లించింది.  "ఏంటి? మీ పేరెంట్స్ వచ్చారు.. కంప్లైంట్ చేయడానికా? హలో మేడం రిషి.. నీకు తెలుసో లేదొ.. ఇక్కడ ప్రిన్సిపాల్ మాకే సపోర్ట్.. వార్డెన్, వైస్ ప్రిన్సిపాల్  కే ఫుల్ సపొర్ట్.. మేం తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తాం.. మర్యాదగా రూం ఖాళీ చెయ్.. లేకపోతె అసలు ర్యాగింగ్ అంటే ఏంటో చూపిస్తాం.." ఆ పిచ్చితల్లి మాకు చెప్పకుండా ఇంకా ఎన్నిమాటలు పడిందో.. ఎంత బాద పడిందో మా అమ్మాయి  సూసైడ్ చేసుకుంటుందని తెలిస్తే ఎప్పుడో తీసుకువెళ్లే వాళ్లం అని ఆమె తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు.

Also Read: రిషికేశ్వరి ఘటనతో ఆందోళన.. యూనివర్సిటికి పది రోజులు సెలవులు

రండి రిషితేశ్వరికి అన్యాయాన్ని ప్రతిఘటిద్దాం... మరో రిషితేశ్వరికి ఇలాంటి పరిస్థితి కలగకుండా పిడికిలి బిగిద్దాం. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి.. అయినా నోరు మెదపకుండా ఉన్నాం.. మొన్నా ఇలాంటి ఘటనలే.. నిన్న ఇలాంటి ఘటనలే. మరి రేపు... ఇంకో ఆడబిడ్డ తన చదువుకు వచ్చి చావుకు స్వాగతం పలకరాదు అంటే అందరం నడుంబిగించాలి. జరుగుతున్న అన్యాయం మీద ప్రతిస్పందిద్దాం.. రిషితేశ్వరి కుటుంబానికి అండగా ఉందాం... వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బాసటగా నిలుద్దాం.. తెలుగువిశేష్ తో కలిసి న్యాయం కోసం పోరడదాం...

#Rishiteshwari #?WeWantJustice #JusticeForRishiteshwari

By Abhinavachary

Also Read: నాగార్జునా యూనివర్శిటీలో ఉద్రిక్తత.. తూతూ మంత్రంగా ముగిసిన నిజనిర్థారణ కమిటీ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles