Police finds the mystery behind Nagarjuna University Student Rishikeshwari Suicide with Ragging | Ragging News

Nagarjuna university student rishikeshwari suicide case ragging mystery police investigation

rishikeshwari suicide case, rishikeshwari ragging case, rishikeshwari ragging news, rishikeshwari updates, rishikeshwari suicide updates, ragging cases, acharya nagarjuna university, university student rishikeshwari

Nagarjuna University Student Rishikeshwari Suicide Case Ragging Mystery Police Investigation : Police finds the mystery behind Nagarjuna University Student Rishikeshwari Suicide Case In Ragging.

వర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య వెనుక రియల్ మిస్టరీ ఇదే!

Posted: 07/22/2015 01:44 PM IST
Nagarjuna university student rishikeshwari suicide case ragging mystery police investigation

వర్సిటీల్లో జూనియర్ల మీద సీనియర్లు ‘ర్యాగింగ్’ పేరుతో చిత్రహింసలకు గురిచేస్తున్న సంఘటనలు ఇప్పటికీ చోటు చేసుకుంటున్నాయి. పైశాచికానందం పొందడం కోసం జూనియర్లను వేధించడం, వివిధ రకాల పనులు చేయించడం, ఇంకా కొట్టడం వంటివి చేస్తుంటారు. ఈ ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విద్యార్థుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. దీంతో కొందరు విద్యార్థులు కాలేజీలకు వెల్లడానికి తీవ్ర భయాందోళనలకు గురవుతుంటే.. మరికొందరు మానసిక ఆవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇటీవలే జరిగిన సంఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు. ర్యాగింగ్ తో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంచలనంగా మారిన ఈ కేసులో ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం వెనుక అసలు కారణం ఏంటో మిస్టరీ వీడింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషికేశ్వరి సీనియర్ల ‘ర్యాగింగ్’తో మనస్తాపానికి గురైన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏదో చిన్న కారణం అయి వుండొచ్చని పోలీసులు భావిస్తూ వచ్చారు కానీ.. అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్సిటీకి వచ్చి విచారణ జరిపిన తరువాత పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే వారు రిషికేశ్వరి డైరీని చదవగా.. కళ్లు బైర్లు కమ్మే నిజాలు బహిర్గతం అయ్యాయి. రిషికేశ్వరిని అర్ధనగ్నంగా హాస్టల్ లో తిప్పి.. ఆ మొత్తం తతంగాన్ని వీడియో చిత్రీకరించి.. ఆ వీడియోని సీనియర్ విద్యార్థులందరికీ సెల్ ఫోన్లకు పంపించడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన డైరీలో మరిన్ని విషయాలను తెలిపింది.

రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు ఆమెను సీనియర్లు బలవంతంగా ఓ సినిమాకు తీసుకెళ్లారు. ఆ సమయంలోనే ఓ సీనియర్ విద్యార్థిని ఒకరు తీవ్రంగా వేధించగా.. రిషికేశ్వరిని మధ్యలోనే వెనక్కు వచ్చేసిందని వార్తలు వచ్చాయి. అలా ఆమె వెనక్కు రావడంతో హాస్టలులో పెద్ద తతంగమే నడిచింది. సీనియర్లకు అనుకూలంగా ఆమె సహకరించనందుకు శిక్ష విధించారు. ఆ శిక్ష ఏమిటంటే.. ఆమెను అర్ధనగ్నంగా హాస్టల్ మొత్తం తిప్పారు. ఆపై దాని వీడియో కూడా తీశారు. ‘ఆ అమ్మాయికి శిక్ష వేశాము, చూడండి’ అంటూ ఆ వీడియోని అబ్బాయిలకు పంపగా.. ఆ వీడియో వారినుంచి మరింత వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాతే రిషికేశ్వరి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరికొందరు విద్యార్థుల పాత్ర కూడా వుంటుందని భావిస్తున్న పోలీసులు.. ఆ దిశగా విచారణ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : rishikeshwari suicide  ragging case  acharya nagarjuna university  

Other Articles