Salman Khan retracts controversial tweet on Yakub Memon

Salman khan retracts tweets on yakub memon apologises

Parade and Hang Tiger Memon, Not His Brother Yakub, Salman Khan, sallu bhai, salman comments on Yakub Memon, salman khan on Mumbai Blast convict, yakub memon execution on july 30, salman khan fresh controversy, salman khan latest tweets on 1993 Mumbai blast, yakub memon, tiger memon, twitter, salman controversy

Salman Khan mounted a spirited defence of Yakub Memon, set to be executed for his role in the 1993 Mumbai blasts case, but made a U-turn and apologised after his comments provoked strong reactions from political parties and social media users.

యాకూబ్ ఉరి వ్యాఖ్యలపై వెనక్కు తగ్గిన సల్మాన్ ఖాన్

Posted: 07/26/2015 08:24 PM IST
Salman khan retracts tweets on yakub memon apologises

ముంబై వరుస పేలుళ్ల దోషి యాకుబ్ మెమన్‌ను ఉరితీతపై బాలివుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యాలపై దేశవ్యాప్తంగా నిరసన సెగలు పెల్లుబిక్కడంతో వెనక్కి తగ్గారు. యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేసిన సల్మాన్ ఖాన్ తన తప్పును సరిదిద్దుకున్నారు. ఈ కేసులో అసలు దోషి యాకూబ్ మెమన్ సోదరుడు టైగర్ మెమన్ అంటూ వ్యాఖ్యానించిన ఆయన అసులు దోషి  టైగర్ మెమన్ స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటుంటే.. ఆయనను పట్టుకుని ఉరికంభం ఎక్కించే బదులు.. నిరపరాధి అయిన టైగర్ మెమన్ సోదరుడు యాకూబ్ ఉరితీయడంపై అక్షేపనీయమన్న సల్మాన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.

సల్మాన్ చేసిన ట్వీట్లపై సొంత తండ్రి నుంచే విమర్శలు రావడంతో తాను చేసిన ట్వీట్లను వెనక్కు తీసుకున్నారు. తనవల్ల ఎదైనా తప్పు జరిగితే క్షమించాలని కోరారు. ఈ మేరకు మరో ట్వీట్ చేశారు. యాకుబ్‌ అమాయకుడని, అతడిని ఉరితీస్తే మానవత్వాన్ని ఉరితీసినట్లేనంటూ సల్మాన్ వరుస ట్వీట్లు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా జైలులో గడిపిన యాకుబ్‌ ఈ నెల 30న ఉరికంబం ఎక్కనున్నారు. రేపు సుప్రీంకోర్టులో యాకుబ్ మెర్సీ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి 30న యాకుబ్ ఉరి ఉంటుందా లేక వాయిదా పడుతుందా అన్నది తేలనుంది.

1993లో జరిగిన ముంబై వరుస పేలుళ్లలో 250 మంది అమాయక ప్రజలు చనిపోయిన కేసులో దోషులను సల్మాన్ ఖాన్ వెనకేసుకురావడంపై పలు పార్టీలు మండిపడ్డాయి. సల్మాన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్ చేసింది. పార్లమెంట్‌లో రేపు సల్మాన్ వ్యవహారాన్ని లేవనెత్తుతానని బిజెపి ఎంపీ కిరీటీ సోమయ్య తెలిపారు. సల్మాన్ న్యాయస్థానం తీర్పును తప్పుబడుతున్నారా అని శివసేన ప్రశ్నించింది. ఎన్సీపీ కూడా సల్మాన్ వైఖరిని తప్పుబట్టింది. న్యాయస్థానం తీర్పులను ప్రశ్నించరాదని సూచించింది..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  yakub memon  tiger memon  twitter  salman controversy  

Other Articles