kanpur woman finds rs 95000 crore in her bank account

Sbi accounting error makes this kanpur woman super rich for a day

uttar pradesh, kanpur, woman, bank account, Kanpur woman super rich, domestic help, richest women, Rs 95,000 crores, Urmila Yadav, Kanpur's Vikas Nagar, savings account, SBI's UPSIDC branch in Vikas Nagar, central government's Jan Dhan Yojana, Urmila Yadav, SBI, Bank account, Richest woman, Kanpur

A few days ago, a woman from Kanpur, who works as a domestic help, became one of the richest women when an amount of Rs 95,71,16,98,647 was credited to her State Bank of India (SBI) account

అమె పేదరాలు.. కానీ బ్యాంకు ఖాతాలో 95 వేల కోట్లు..

Posted: 07/26/2015 02:16 PM IST
Sbi accounting error makes this kanpur woman super rich for a day

ఆమె కడు పేదరాలు. తనకు తెలియకుండానే తన ఖాతాలో మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 95 వేల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఆమెను ఏకంగా ప్రపంచ ధనవంతురాలల్లో ఒకరిగా మార్చింది. అదేలా సాధ్యమంటారా..? కానీ ఇది నిజం. అమె ఖాతాలో అంత డబ్బు ఎలా వచ్చిందో అమెకు తెలియదు. అందుచేతే అమె తన ఖాతాలోని డబ్బు చూసి ఆశ్చర్యానికి గురైంది. తాను ఈ విషయాన్ని నమ్మలేకపోతునాన్నిని చెప్పేంత లోపే ఆ డబ్బు ఎలా వచ్చిందో ఆలా మాయమయ్యింది. మీరు కూడా విస్మయానికి గురవుతున్నారా..? ఇది ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ బ్యాంకు సిబ్బంది చేసిన తప్పిదం కారణంగానే అంటే నమ్మగలరా..?
 
వివరాల్లోకి వెళితే.. కాన్పూర్‌కి చెందిన ఊర్మిళా యాదవ్ అనే మహిళ కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్ ధన్ యోజన’ పథకం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరిచింది. అందులో రెండు వేల జమ చేసింది. అనంతరం ఆమె మొబైల్ ఫోన్‌కు రెండు మెసేజ్‌లు వచ్చాయి. అందులో మొదటిది 9,99,999 మీ అకౌంట్‌లో జమయ్యాయి అని, రెండోది అందులోంచి 9.7 లక్షలు డెబిట్ కావడంతో రెండు వేలు ఉన్నాయి అని మేసేజ్‌లు వచ్చాయి. ఆశ్చర్యపోయిన ఆమె బ్యాంకుకు వెళ్లి ఆరా తీసింది. దీంతో ఆమె ఖాతా తనిఖీ చేయగా ఆమె ఖాతాలో 9,571,16,98,647.14 మొత్తం ఉన్నట్టు తేలింది.

బ్యాంకు అధికారులు కూడా సరిగ్గా పలకలేకపోయిన ఆ మొత్తం చూసి ఊర్మిళకు గుండెపోటు వచ్చినంత పని అయింది. అయితే ఈ విషయంపై బ్యాంకు మేనేజర్ వివరణ ఇచ్చారు. ఊర్మిళ ఖాతాలో ఉండాల్సిన కనీస మొత్తం లేదని, దాంతో ఆమె ఖాతాలో 95 వేల కోట్లు జమ చేసి తర్వాత దానిని తీసేశామని తెలిపారు. కాగా, ఖాతాదారుడికి తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా ఆ అకౌంట్‌లో నుంచి డబ్బుల తీయడం, వేయడం చేయకూడదన్నది బ్యాంకు నిబంధన. దీంతో ఈ మొత్తం ఘటనపై విచారణ జరపాలని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttar pradesh  kanpur  woman  sbi bank account  Urmila Yadav  Richest woman  Kanpur  

Other Articles