He Got An Examiner's Job Just To Tear Up The Answer Scripts Of The Girl Who Rejected Him!

One side lover took revenge on her lover who rejected him

P Madhukumar, BSC, supplementary exam answer script, Vijayanagara Sri Krishnadevaraya University, M.SC, B.Sc, lover's supplementary exam answer sheets, Examiner's Job, Girl Who Rejected Him, Girl Who Rejected his love, examiner criminal act, Ballari rural police

To take revenge on an ex-classmate who rejected his proposal, an MSc student tore up four of her supplementary exam answer scripts at the evaluation centre of the Vijayanagara Sri Krishnadevaraya University recently.

ప్రేమోన్మాది తన ప్రేయసిపై ఇలా పగతీర్చుకున్నాడు..

Posted: 07/25/2015 09:47 PM IST
One side lover took revenge on her lover who rejected him

తన ప్రేమను తిరస్కరించిందంటూ అమెపై కక్ష పెంచుకున్న ఓ భగ్న ప్రేమికుడు అమెపై ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు. చివరికి అడ్డంగా దోరికిపోయి.. కటకటాల పాలయ్యాడు. తన ప్రేమించిన ఓ యువతి పరీక్షా జవాబుపత్రాలను చించి టాయిలెట్‌ బిన్‌లో పడేశాడో ఉన్మాది. కలకలం రేపిన ఈ ఘటన కర్నాటక బళ్లారిలో జరిగింది. విజయనగర శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎమ్సెస్సీ చదువుతోన్న మధుకుమార్ అనే విద్యార్ధి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఇదే యూనివర్సిటీలో ఎమ్సెస్సీ చదువుతోన్న ఓ యువతిని ఈ ఉన్మాది రెండేళ్ల క్రితం బిఎస్సీలో ఉండగా ప్రేమించాడు. అయితే ఆమె ఇతడి ప్రేమను తిరస్కరించింది. ఆ తర్వాత ఆ యువతి ఎమ్మెస్సీలో చేరగా మధు మాత్రం బిఎస్సీ తప్పాడు.

కొంత కాలం తర్వాత ఎలాగోలా బిఎస్సీ పాసై ఆ యువతి చదువుతున్న యూనివర్సిటీలోనే చేరాడు. కక్ష తీర్చుకునే అవకాశం కోసం ఎదురుచూశాడు. యూనివర్సిటీ ప్రశ్నాపత్రాల గదిలో రోజుకు రెండొందల రూపాయల జీతం ఉన్న పార్ట్‌టైం ఉద్యోగం సంపాదించిన మధు ఆ యువతి సప్లిమెంటరీ జవాబుపత్రాలను చూశాడు. ఆ తర్వాత మొదటి పేజీ, చివరి పేజీ అలాగే ఉంచి మధ్యలో ఉన్న పేజీలన్నింటినీ చించి టాయిలెట్‌ బిన్‌లో పడేశాడు. మధు ప్రవర్తనపై అనుమానం వచ్చిన లెక్చరర్ ఒకరు పై అధికారులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకు కక్కాడు. పోలీసులు ఉన్మాది మధును అరెస్ట్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles