Mumbai | Rape | father raped daughter | Mumbai rape

A father raped his own daughter in mumbai

Mumbai, Rape, father raped daughter, Mumbai rape

A father raped his own daughter in Mumbai. When a teenage girl quietly slipped a letter to her school teacher last week, the latter had no idea that it was not a simple request for leave, but a desperate plea for help. For, in the letter, the child had written that her father had been raping her, and that her mother, who had witnessed these sexual assaults, did nothing to help her.

కన్న కూతురిని రేప్ చేసిన తండ్రి... తల్లి కూడా అడ్డుచెప్పలేదు

Posted: 07/22/2015 01:15 PM IST
A father raped his own daughter in mumbai

నీచం.. నికృష్టం.. కిరాతకం.. ఇలా ఎన్ని పదాలు వాడినా తక్కువే. పేగు పంచుకొని పుట్టిన కూతిరిని గారాల పట్టీలా, తల్లిలాగా చూసుకోవాల్సిన తండ్రి కామంతో కాటేశాడు. కన్న కూతురు అనే విచక్షను మరిచి.. కామంతో కూతుర్నే చరిచాడు. వావి వరుస లేని మృగంలాగా తండ్రి కాకుండా ఓ మానవ మృగంలా కూతురిని చెరబట్టాడు. నాన్నా నాకీ కష్టం వచ్చింది అని చెప్పుకోవాల్సిన కూతురు మీదనే తండ్రి కామంతో కాటేస్తే.. ఆ చిన్న తల్లి విలవిలాడింది. తండ్రి మానవత్వాన్ని మమకారాన్ని మరిచి.. జంతువులాగా తన మీద పడి చరుస్తుంటే ఏం చెయ్యాలో తెలియదు ఆ చిట్టితల్లికి... అమ్మా నాన్న ఇలా చేస్తున్నాడు అని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోని తల్లి. తన బాధను ఎవరికి చెప్పుకోవాలొ అర్థంకాని ఆ పిచ్చిమాలోకానికి దేవుడు పెట్టిన పరీక్ష. అయినా ఇంత దారుణానికి దేవుడిని బాధ్యుడిని చెయ్యడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.

మనుషులు మనుషుల్లాగా ప్రవర్తించడం మానేసి చాలా కాలం అయింది.. కానీ ఇలా మానవత్వాన్ని కూడా మరిచి, కామంతో కన్నూ మిన్నూ తెలియకుండా కాటు వేసే అతి దారుణాలను రాయండం.. వాటిని చదవడం నిజంగా దురదృష్టం. ఊరన్నాక స్మశానం ఉండటం మామూలే కానీ దారుణాలకు పరాకాష్ట అనుకోవాలో లేదా దీన్ని పైశాచికం అనుకోవాలో అర్థం కావడం లేదు. ముంబైలో ఉంటున్న ఓ చిట్టి తల్లి తన మీద తన తండ్రి రేప్ చేస్తున్నాడని.. కాబట్టి తనకు లీవ్ కావాలని రాయడం సంచనం కలిగించింది. లెటర్ చూసిన ప్రిన్సిపాల్ కు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మీ కూతురుకి పలానా జరిగింది అని చెప్పాల్సిన తండ్రే కూతురి మీద నీచానికి పాల్పడితే ఏం చెయ్యాలో పాల్పోలేదు.

ముంబైలో ఉంటున్న ఓ పళ్ల బండి వ్యాపారి కూతురు.. తన పాఠశాల టీచర్ కు లెటర్ రాసింది. తనను తన తండ్రి రేప్ చేస్తున్నాడని.. కాబట్టి తనకు లీవ్ కాలని అందులో ఉంది. అయితే తన తండ్రి దుర్మార్గాన్ని తల్లికి ఎన్ని సార్లు చెప్పినా కూడా లాభం లేకుండా పోయిందని ఆ చిన్నారి తెలిపింది. తన తల్లి తనకు ఏదో పిల్స్ ఇచ్చిందని కూడా చిన్నారి తెలిపింది. అయితే అవి గర్భనిరోధక మాత్రలేనా అనే అనుమానం రేకెత్తుతోంది. కడుపులో పెట్టి చూసుకోవాల్సిన బిడ్డకు కడుపు వస్తుందేమో అన్న అనుమానంతోనే ఆ కసాయి తల్లి పిల్స్ అందించి ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. ఆ చిన్నారికి ఒక అక్క, ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ేడవ తరగతి చదువుతున్న ఆ చిన్న పాప మీద తండ్రి తన ఏడు సంవత్సరాలుగా ఉన్నప్పటి నుండి ఎన్నో సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ప్రస్తుతం పాప వయస్సు పదమూడు సంవత్సరాలు. అంటే గత ఆరు సంవత్సరాలు ఆ కీచక తండ్రి తన కూతురును చరుస్తున్నాడు.

ఇంట్లో ఎవరూ లేనప్పుడు, తల్లి మాత్రమే ఉన్నప్పుడు, తన తల్లి చూస్తుండగానే తనను అత్యాచారం చేసేవాడని ఆ చిట్టి తల్లి తెలిపింది. నీడనివ్వాల్పిన చెట్టే ఏకాకిని చేస్తే ఆ చిట్టి హృదయం విలవిలాడింది. పాలుగారే పసి పాప మీద పాపానికి ఒడిగట్టిన ఆ కన్న తండ్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజా లెటర్ తో వెలుగు చూసిన ఈ దారుణంపై ఈ టీచర్ ఎన్డీవో సంస్థను సంప్రదించింది. ఆ కిరాతక తండ్రికి తగిన శిక్ష విధించాలని ఎన్జీవో సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో పేరున్న భారతదేశంలో ఇలాంటి దారుణాలు నిజంగా సిగ్గు చేటు. ఆడవారిని ఆదిశక్తిగా, అమ్మగా కొలిచే భారతావనిలో ఇలాంటి దారుణాలు నీచాతినీచం. ఇలాంటి వారిని శిక్షించడం కంటే నడి రోడ్డు మీద నియంత దేశాల్లో కాల్చినట్లు... ఉరివేసినట్లు చిత్రవదలు చేసి చంపాలి. ఇలాంటి దారుణాలు ఎక్కడా జరగనంత దారుణంగా చంపితే కానీ పరిస్థితి మారదు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Rape  father raped daughter  Mumbai rape  

Other Articles