thalasani, congress, TRS, kcr, Tdp, telangana, resignation

Speaker ofice conformed that talasani resignation letter did not arrive

thalasani, congress, TRS, kcr, Tdp, telangana, resignation, Shabbir ali, Revaanth Reddy

Speaker ofice conformed that Talasani Resignation letter did not arrive. By the Right to information act request letter speaker office conformed the talasani resignation

తలసాని రాజీనామానే చెయ్యలేదు

Posted: 07/19/2015 06:56 PM IST
Speaker ofice conformed that talasani resignation letter did not arrive

తలసాని రాజీనామా వ్యవహారంపై మళ్లీ దుమారం మొదలైంది. తలసాని రాజినామా అంతా అబద్దమంటున్నారు టీ కాంగ్రెస్‌ నేతలు. తలసాని వ్యవహారంపై టీడీపీ కన్నా కాంగ్రెస్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరేముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తలసాని ప్రకటించారు. అయితే..తలసాని రాజీనామాపై స్పీకర్ నిర్ణయం పెండింగ్‌లో ఉన్నదనే విషయంపైనే ఇప్పటివరకు అందిరి చర్చ.  తలసాని రాజీనామాపై ఆర్టీఐ కింద టీ-కాంగ్రెస్‌ నేత గండ్ర దరఖాస్తు చేసుకున్నారు. గండ్ర దరఖాస్తును పరిశీలించిన అసెంబ్లీ అధికారులు సమాధానమిస్తూ..అసలు తలసాని రాజీనామా తమకు చేరనేలేదని అసెంబ్లీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో అసలు వివాదం మొదలైంది. తలసానిపై వెంటనే చర్యలు తీసుకొని చీటింగ్ కేసు నమోదు చేయాలని టీ-కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తోంది.

రాజీనామా వివాదంలో టీ-కాంగ్రెస్‌ లేవనెత్తిన ఆరోపణలను తలసాని కొట్టిపారేశారు. రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తే..అధికారుల దగ్గర ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారాయన. తలసాని లాజిక్‌తో వివాదానికి మరింత మసాల జోడించినట్టైంది. తలసాని రాజీనామాపై ఇప్పటివరకు స్పీకర్‌ కార్యాలయమైతే స్పందించలేదు. దీంతో తలసాని రాజీనామా లేఖపై స్పీకర్‌ ఏం చెబుతారనేది ఉత్కంఠగా మారింది. అయితే దీనిపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసలు తలసాని రాజీనామా అంతా బూటకమని.. కేసీఆర్ వెంటనే తలసానిని బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. గవర్నర్ దీని మీద వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ రాజీనామా అంశాన్ని పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తుతామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌ ఆలీ వెల్లడించారు. తలసాని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదనే అంశంపై స్పందించిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు నీతి ఉంటే, సిద్ధాంతపరుడైతే తక్షణమే తలసానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ను తలసాని తప్పుదోవ పట్టించారా? ఏక కేసీఆరే తలసానికి తప్పుడు సలహా ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌ నరసింహన్‌ చట్టాన్ని కాపాడే వ్యక్తి.. గత ఏడు నెలలుగా అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదు చేస్తున్నామని.. అయినా గవర్నర్‌ పట్టించుకోవడం లేదని షబ్బీర్‌ ఆలీ విమర్శించారు. ఒక దానిపై ఫిర్యాదు వచ్చినప్పుడు గవర్నర్‌గా ఆయన బాధ్యత ఆయన నిర్వహించడం లేదని ఆయన మండిపడ్డారు. తలసాని మంత్రి పదవిలో కొనసాగడంపై ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : thalasani  congress  TRS  kcr  Tdp  telangana  resignation  Shabbir ali  Revaanth Reddy  

Other Articles