chandrababu makes ashok gajapathi raju feel guilty and cools him down

Ashok gajapathi raju wants resign his central ministers post

chandrababu makes ashok gajapathi raju feel guilty and cools him down, ashok gajapathi raju wants resign his central ministers post, ashok gajapathi raju, chandrababu naidu, andhra pradesh, Union minister, performance, gannavaram airport

Central Minister Ashok Gajapathi Raju wanted to resign his Central Minister's post, due to AP CM Chandrababu comments, on his performance.

రాజీనామాకు సిద్దమన్న అశోకగజపతి.. అసంతృప్తి వ్యక్తపర్చి.. బుజ్జగించిన బాబు

Posted: 07/19/2015 11:05 AM IST
Ashok gajapathi raju wants resign his central ministers post

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు మనస్తాపానికి గురయ్యారు. కేంద్ర మంత్రి పదవికి తాను రాజనీమా చేస్తానని చెప్పడమే కాదు ఏకంగా అందుకు సిద్దమయ్యారు కూడా. దీంతో ఆయనను చల్లబర్చే బాద్యతను చంద్రబాబు తీసుకుని సముదాయించారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా చంద్రబాబు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి వేగంగా జరగడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర విమానయాన శాఖ నుంచి కేటాయించిన నిధుల విడుదల కూడా ఆలస్యమవుతోందని చెప్పారు. దాంతో అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ, తాను అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని బదులిచ్చారు. ‘‘మీది స్వతంత్ర శాఖ. రాష్ట్రానికి రావలసిన నిధులను మాట్లాడి తెచ్చుకోవాలి కదా’’ అని బాబు అన్నారు. గన్నవరం విమానాశ్రయం టెర్మినల్‌ పనులను వేగంగా చేస్తున్నామని, భోగాపురం విమానాశ్రయం రావడానికి కూడా తాను కృషి చేశానని అశోక్‌ చెప్పారు. గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూసేకరణలో జాప్యం తప్ప వేరే కారణం లేదని వివరించారు.

అదే సమయంలో, రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల విషయంలో మనం ఏమీ చేయలేకపోతున్నామని ఒకరిద్దరు ఎంపీలు వ్యాఖ్యానించారు. దాంతో, పేరుకు తనది స్వతంత్ర శాఖే అయినా ప్రతి ఫైలు ప్రధాని పేషీకి వెళ్లాల్సిందేనని మంత్రి అశోక్‌ చెప్పారు. శాఖాపరంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పీఎం పేషీలో అధికారులు అనేక కొర్రీలు వేస్తుంటారని, దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. దాంతో, ‘‘పనులు వేగంగా అయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయి. చేయాల్సిందంతా చేస్తే ప్రజల నుంచి విమర్శలు రావు కదా’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

దీనిపై, ‘‘మీరు నా పనితీరు పట్ల సంతృప్తిగా లేకపోతే తొలగించండి సార్‌. మీకు ఇబ్బంది అనుకుంటే రేపు తొలి గంటలో రాజీనామా చేసి రాష్ట్రపతికి అందజేస్తా’’ అంటూ సున్నిత మనస్కుడైన అశోక్‌ గజపతి రాజు వ్యాఖ్యానించడంతో ఎంపీలు బిత్తరపోయారు. చిరుజల్లులా మొదలైన వాతావరణం జడివానగా మారడంతో చంద్రబాబు టాపిక్‌ మార్చి పరిస్థితిని చల్లబరిచారు. సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలోనూ.. చంద్రబాబు, కేంద్ర మంత్రి సుజనా, ఎంపీలు హాజరైన ఇఫ్తార్‌ విందులో కూడా ఆశోక గజపతిరాజు పాల్గొనలేదు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashok gajapathi raju  chandrababu naidu  andhra pradesh  Union minister  performance  

Other Articles