all engineering colleges will participate in eamcet councelling

Private engineering colleges reprieve in the high court

private engineering colleges reprieve in the high court, private engineering collage, high court, single bench, eamcet councelling, division bench, jntuc, proper arrangements, collage recognisation

high court division bench made minor changes to single bench judgement, says JNTU can dismiss collage recognisation if proper arrangements are not made

ప్రైవేటు కాలేజీలకు హైకోర్టులో ఊరట. ఎంసెట్ కౌన్సిలింగ్ మరింత ఆలస్యం

Posted: 07/15/2015 08:18 PM IST
Private engineering colleges reprieve in the high court

రాష్ట్ర సర్వోన్నత స్థాయ స్థానం హైకోర్టులో ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఊరట లభించింది. కౌన్సిలింగ్‌కు అనుమతిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. అలాగే సింగిల్‌ బెంచ్‌ తీర్పులో ఒక అంశాన్ని సవరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని, అదేశించింది. 25 బృందాలతో 10 రోజుల్లోగా మరోమారు తనిఖీలు చేపట్టాలని న్యాయస్థానం అదేశించింది. తనిఖీల్లో అవకతవకలు జరిగితే అనుమతులు రద్దు చేయాలని కోర్టు సూచించింది.

నెలాఖరులోగా తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ 2 లక్షల రూపాయలు డిపాజిట్‌ చేయాలని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసిన హైకోర్టు సరైన ప్రమాణాలు పాటించని కాలేజీల గుర్తింపు రద్దు చేసి అధికారం జేఎన్ టీయూకు వుందని కూడా స్పష్టం చేసింది. మూడు రోజుల్లో అధికారులు తనిఖీలు మొదలు పెట్టాలని డివిజన్ బెంచ్ అదేశాలు జారీ చేసింది. కాలేజీల గుర్తింపు అనేది హైకోర్టులో పెండింగ్ లో వుందని కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులకు తెలియజేయాలని పేర్కోంది. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎంసెట్ కౌన్సిలింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles