1993 Mumbai serial blasts: Yakub Memon likely to be hanged on July 30

1993 mumbai blasts convict yakub memon to be execute on july 30

1993 mumbai blasts convict yakub memon to be execute on july 30, yakub memon, yakub memon death, yakub memon hanging, mumbai blasts, 1993 mumbai blasts, yakub memon execution, 1993 bombay blasts, 1993 mumbai blasts, tiger memon, dawood ibrahim, india news

1993 Mumbai serial blasts convict Yakub Memon is likely to be hanged on July 30 if his curative petition for mercy is rejected by the Supreme Court on July 21.

ముంబై పేలుళ్ల దోషి యాకుబ్ మొమన్ కు 30న ఉరిశిక్ష

Posted: 07/15/2015 08:16 PM IST
1993 mumbai blasts convict yakub memon to be execute on july 30

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1993 వరుస పేలుళ్ళ కేసులో దోషిగా నిర్థారించిన యాకుబ్ మెమన్‌ను డెత్ వారెంట్ జారీ అయ్యింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం డెత్ వారెంట్ ను విడుదల చేసింది. దీంతో యాకుబ్ మోమన్ ను ఈ నెల 30న ఉరితీయనున్నారు. జులై 21న అతడు దాఖలు చేసే కూరేటివ్ పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో టాడా కోర్టు యాకుబ్ కు విధిచిన ఉరిశిక్షను నాగపూర్ సెంట్రల్ జైలులో 30వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి శిక్షను అమలు చేయనున్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉరి శిక్ష అమలుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన మెమన్ (53) ప్రస్తుతం నాగపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరస్కరించారు. సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తామని మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. 1993 మార్చ్ 12న జరిగిన ముంబై వరుస పేలుళ్లకు యాకుబ్ మెమన్ ధనాన్ని సమకూర్చాడు. నాటి వరుస 13 పేలుళ్లలో 257 మంది చనిపోయారు. 700 మంది గాయపడ్డారు. ఈ కేసులో మెమన్‌ దోషిగా తేలడంతో ముంబైలోని ప్రత్యేక టాడా కోర్టు 2007 జులై 27న అతడికి ఉరిశిక్ష విధించింది. 1993 పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న వారిలో తొలి వ్యక్తి యాకుబ్ మెమనే కావడం గమనార్హం. ఇదే కేసులో దోషులుగా తేలిన మరో పది మందికి 2013 మార్చి 21న.. ఉరి శిక్షను యావజ్జీవ శిక్షకు తగ్గిస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yakub memon  hanging  1993 mumbai blasts  supreme court  

Other Articles