Sandra Venkata veeraiah got conditional bail in ACB court

Acb court grants bail to sandra

bail to Sandra, cash for vote, ACB court bail to Sandra, Sandra gets bail, Sandra Venkata Veeraiah gets bail, AP political news, cash for vote, note for vote, phone tapping, revanth reddy, stephen son, mlc elections, horse riding, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, telugu news, ap news, telangana news, india news, world news, entertainment news

Sandra Venkata Veeraiah, who was alleged to be one of the key members in the cash for vote scam, was granted the bail by the ACB court today.

సండ్ర వెంకట వీరయ్యకు కండీషనల్ బెయిల్ మంజూరు

Posted: 07/14/2015 03:53 PM IST
Acb court grants bail to sandra

ఓటుకు నోటు కేసులో నాల్గవ, కీలక నిందితుడిగా అరెస్టయిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ న్యాయస్థానం ఊరట లభించింది. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కోంటున్న సండ్రకు ఏసీబి న్యాయస్థానం బెయిట్ మంజూరు చేసింది. కాగా బెయిల్ విషయంలో పలు షరతులను విధించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని సండ్ర దాఖలు చేసుకున్న పిటీషన్ పై ఇప్పటికే రెండు పర్యాయాలు వాయిదా వేసిన న్యాయస్థానం నిన్న ఈ పిటీషన్ పై సండ్ర సహా తెలంగాణ ఏసిబి అధికారులు తరపు వాదనలను వినింది.

ఈ పిటీషన్ పై తీర్పును నేటి వాయిదా వేసిన న్యాయస్థానం ఇవాళ సండ్రకు బెయిల్ ను మంజూరు చేస్తూ.. తీర్పును వెలువరించింది. రెండు లక్షల రూపాయల పూచికత్తు సమర్పించి. బయటకోచ్చిన తరువాత తమ తమ నియోజకవర్గం దాటి బయటకు వెళ్లవద్దని షరతు విధించింది. పాస్‌పోర్టును తమకు అప్పగించాలని ఏసీబీ న్యాయస్థానం సండ్రను ఆదేశించింది. 2 లక్షల రూపాయల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరించాలని సండ్రను న్యాయమూర్తి ఆదేశించారు. సండ్రకు బెయిల్ మంజూరుపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bail to Sandra  ACB court  cash for vote  

Other Articles