IRS Scam Gets Indian-American Sahil Patel Over 14 Years In Prison

Man gets 14 years in irs scam that cost taxpayers millions

Man gets 14 years in IRS scam that cost taxpayers millions, IRS Scam Gets Indian-American Sahil Patel Over 14 Years In Prison, Hellerstein, India, jail, Sahil Patel, Indian-American, massive extortion, India-based call centres, Internal Revenue Service (IRS), Scam, U.S. District Judge Alvin K. Hellerstein, Internet-based calling service, FBI, Manhattan federal prosecutor's office, US, World

Sahil Patel, an Indian-American has been jailed for more than 14 years and fined $1million for running a massive extortion ring from India-based call centres in which he and his co-conspirators impersonated FBI and Internal Revenue Service (IRS) officials and threatened to arrest victims unless they made payments

అమెరికాలో భారతీయుడి భారీ కుంభకోణం

Posted: 07/10/2015 01:50 PM IST
Man gets 14 years in irs scam that cost taxpayers millions

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుడు భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు. అమెరికాలో పన్ను చెల్లింపు దారులను టార్గెట్ గా చేసుకుని ఇండో అమెరికన్ భారీ రెవెన్యూ కుంభకోణానికి పాల్పడ్డాడు. పన్ను చెల్లింపు దారులను బెదిరించి దాదాపు రూ.126 కోట్ల(20 మిలియన్‌ డాలర్లు)కు పైగా వసూలు చేశాడు ఈ ఆర్థిక నేరగాడు. ఎట్టకేలకు తాను చేసిన మోసం భయట పడటంతో.. ఈ కుంభకోణం సూత్రధారి షాహిల్ పటేల్ ను అమెరికా పోలీసులు న్యాయస్థానం ముందు నిలబెట్టారు. న్యాయస్థానంలో తాను చేసిన మోసాన్ని అంగీకరించిన నిందితుడికి కోర్టు 14 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

కేసులో పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి అల్విన్‌ కె హెలెర్‌స్టీన్‌.. కుంభకోణం 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.6.3 కోట్ల(1 మిలియన్‌ డాలర్ల) జరిమానా విధించారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న తతామీలో నివసిస్తున్న భారత్‌కు చెందిన సాహిల్‌ పటేల్‌(36).. భారత్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అక్కడ అందరినీ మహిళలలనే ఏర్పాటు చేసి.. వారితో ఓ ముఠాను తయారు చేసుకున్నాడు. భారత్ నుంచి ఇంటర్ నెట్ అనుసంధానంతో ఫోన్ కాల్స్ చేసి.. ఆ నెంబర్లు ఎఫ్.బి.ఐ లేదా మన్ హట్టన్ లోని ఫెడరల్ కార్యాలయం నెంబర్లతో సరిపోయేలా వుండేట్లు చేసుకుని పన్ను చెల్లింపుదారులను బెదిరించేవారు.

తమను తాము ఐఆర్‌ఎస్‌ (ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌) ఏజెంట్లుగా పేర్కొంటూ పన్ను చెల్లింపుదారులను బెదిరించి డబ్బులు రాబట్టారు. పలువురికి ఈ ఫోన్ కాల్స్ విషయంలో సందేహాలు కలిగినా.. అవి ఎఫ్ బిఐ అధికారుల ఫోన్ నెంబర్లతో సరిపోలడంతో వారు మిన్నకుండి.. తమను ప్రభుత్వం టార్గెట్ చేసిందనుకుని సాహిల్ పటేల్ వలలో పడిపోయారు. 2011 డిసెంబర్‌ నుంచి 2013 డిసెంబర్‌ మధ్య దేశ వ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులను బెదిరించిన ఈ ముఠా ముఖ్యంగా ఐదు రాష్ర్టాల్లోని ప్రజల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడింది. అమెరికా టాక్స్‌ ఏజెన్సీ చరిత్రలో అతిపెద్దదని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hellerstein  India  jail  Sahil Patel  Scam  US  World  

Other Articles