Yasin Bhathkal | Terrorist | Yasin | Dilsukhnagar Bobm blast

Terrorist yasin bhathkal attend before the court with rose flower

Yasin Bhathkal, Terrorist, Yasin, Dilsukhnagar Bobm blast

terrorist Yasin Bhathkal attend before the court with Rose Flower. Yasin Bhathkal brought a rose flower with him.

ఉగ్రవాది యాసిన్ భత్కల్ చేతిలో గులాబీ పువ్వు

Posted: 07/09/2015 04:12 PM IST
Terrorist yasin bhathkal attend before the court with rose flower

ఇనుములో హృదయం మొలిచెనే.. అనే పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. శంకర్ డైరెక్ట్ చేసిన రోబో సినిమాలోని ఆ పాటను ఎవరు మాత్రం మరిచిపోతారు చెప్పండి. అయితే ఇనుములో హృదయం మొలుస్తుందేమో కానీ ఉగ్రవాదిలో మాత్రం కాదు. ఏంటి గందరగోళంగా ఉంది అనుకుంటున్నారేమో కానీ ఓ కరడుగట్టిన ఉగ్రవాది గులాబీ పువ్వు చేతపడితే ఎలా ఉంటుంది అని చెప్పడానికే ఈ తతంగం అంతా. అయితే దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు, కరడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ తాజాగా చేతిలో గులాబీ పట్టుకొని కోర్టులో హాజరయ్యారు. దాంతో ఏం జరుగుతోందా పోలీసులకు ముక్క అర్థం కాలేదు. ఎడారిలో నుండి నీళ్లైనా తియ్యొచ్చు కానీ భత్కల్ లాంటి వాళ్లు గులాబీ పువ్వు చేతిలో పెట్టుకున్నంత మాత్రాన మంచి వాళ్లు అంటే నమ్ముతామా ..? ఏంటి.

తాజాగా ఫోన్ లో తాను తొందరలోనే బయటకు వస్తున్నానని, అందరిని కలుస్తానని భార్యకు ఫోన్ లో చెప్పిన యాసిన్ భత్కల్ గత రెండు రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా గులాబీతో కనిపించడంతో అందరికి ఆశ్చర్యం కలిగింది. అయినా మనుషుల రక్తాన్ని తాగే యాసిన్ భత్కల్ లాంటి వాళ్లు ఇలా గులాబీ పువ్వు చేతిలో పట్టుకుతిరిగితే మాత్రం అందరికి ఆశ్చర్యం కలుగుతోంది. అయితే ఇలా భత్కల్ గులాబీ పువ్వు చేతిలో పట్టుకుతిరుగడం పై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలే ఐఎస్ఐఎస్ తనను విడిపించుకువెళుతుంది అని తన బార్యతో చెప్పిన యాసిన్ ను నిజంగా అలాంటిదేమైనా జరుగుతుందా అని చర్చించుకుంటున్నారట. మరి భత్కల్ మారిపోయి గులాబీ చేతపట్టాడో లేదా ఏదైనా ప్లాన్ ఉందో అన్న ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమానం లేదు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yasin Bhathkal  Terrorist  Yasin  Dilsukhnagar Bobm blast  

Other Articles