Vyapam scam: Family of deceased journalist Akshay Singh refuse help from govt

Chouhan offers job to akshay singh s family member

Family of deceased journalist Akshay Singh refuse help from govt, vyapam, vyapam scam, Vyapam Scam, akshay singh, journalist, CBI Probe Vyapam Scam, Supreme Court, supreme court on vyapam scam, Chief Minister Shivraj Singh Chouhan, Madhya Pradesh High Court, 49 witnesses and accused died, namrata damor, namrata death, vyapam death, cbi proble, mbbs, mp govt, shivraj singh chouhan, Dr B B Purohit (Forensic Medicine), Dr O P Gupta (Medical Officer) and Dr Anita Joshi (Gynaecologist), latest news

Akshay Singh died under mysterious circumstances last week while covering the Vyapam scam involving Jhabua-based MBBS student Namrata Damor, who was found dead after her name figured in the scam.

మాకోద్దు మీ తాయిలం.. సీఎం ఉద్యోగ అవకాశాన్ని తిరస్కరించిన కుటుంబం

Posted: 07/09/2015 01:19 PM IST
Chouhan offers job to akshay singh s family member

వ్యాపమ్‌ కేసులో పరిశోధనాత్మక కథనాలకు పేరుపొందిన జర్నలిస్టు అక్షయ్‌సింగ్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన వారం రోజుల తరువాత వ్యాపం కుంభకోణంపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఈ నేపథ్యంలో అక్షయ్ సింగ్ .  మృతిపై అనుమానాలు వ్యక్తమైమయ్యాయి. అక్షయ్ సింగ్ తన కన్నా గోప్పవాడా అంటూ క్యాబినెట్ మంత్రులు నోరు జారారు కూడా. ఆ తురువాత నాలుక కరుచుకుని లేదు లేదు జోక్ చేశామని తమ వ్యాఖ్యలను సమర్థించుకున్నారు కూడా. దీంతో అక్షయ్ సింగ్ కుటుంబ సభ్యులకు సంఘీభావంగా మధ్యప్రదేశ్ లోని విపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు పూనుకున్నారు.

ఈ  తరుణంలో ఢిల్లీలోని ఆయన కుటుంబసభ్యులను మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పరామర్శించారు. అక్షయ్‌సింగ్‌ నివాసానికి వెళ్లిన చౌహాన్‌ అక్కడ కొంతసేపు ఉన్నారు. అక్షయ్‌ తల్లిని, సోదరిని ఓదార్చారు. అక్షయ్‌ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన శివరాజ్ సింగ్ చౌహాన్.. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని మధ్యప్రదేశ్‌ భవన్‌లో అక్షయ్‌ సోదరికి ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చెప్పారు.

అయితే శివరాజ్ సింగ్ ఇచ్చిన తాయిలాన్ని జర్నలిస్టు కుటుంబసభ్యులు మూకుమ్మడిగా తిరస్కరించారు. నితీ, నిజాయితీకి కట్టుబడి తమ బిడ్డ.. చీకటి మయమవుతున్న నిజాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం తప్పా..? మా బిడ్డను అన్యాయంగా చంపేశారంటూ వారు తమ అవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తమకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే.. తమ బిడ్డ హత్యోందంపై నిష్ఫక్షపాత విచారణ జరిపించాలని వారు ముఖ్యమంతిని శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు.

నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు

ముఖ్యమంత్రి పదవికి ఎట్టి పరిస్థితుల్లో తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని మధ్యప్రదేశ్  సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. వ్యాపమ్‌ స్కామ్‌ను బయటపెట్టి విచారణకు ఆదేశించింది తానే అని ఆయన చెప్పుకున్నారు. ఎన్నికల్లో గెలవలేని కాంగ్రెస్‌ తనపై కక్ష్య పెంచుకుని...మధ్యప్రదేశ్‌నే బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌ అంటే స్కాముల ప్రదేశ్‌ అని ప్రచారం జరగడం అన్యాయమన్నారు. వ్యాపమ్‌ స్కామ్‌కు సంబంధించి ప్రతీ మరణంపైన విచారణ జరగాలని శివరాజ్‌ ఆకాంక్షించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vyapam scam  akshay singh  journalist  shivraj sing chouhan  

Other Articles