BJP, Amith sha | Telangana | Kishan Reddy | Hyderabad | BJP Party in ap | BJP Leaders

Bjp party president amith sha fire in telangana bjp leaders

BJP, Amith sha, Telangana, Kishan Reddy, Hyderabad, BJP Party in ap, BJP Leaders

BJP Party President Amith sha fire in telangana bjp leaders. He said that they are not working properly. He questions the leaders how bjp will come to power by 2019.

చాలా కష్టం అంటున్న అమిత్ షా.. తెలంగాణ నాయకుల మీద మండిపాటు

Posted: 07/09/2015 01:22 PM IST
Bjp party president amith sha fire in telangana bjp leaders

వాపును చూసి బలుపు అనుకుంటే పొరపాటే... అయినా అనుకుంటే మాత్రం పొరపాటే అని పెద్దలు అంటూ ఉంటారు. అప్పడప్పుడు మనం చేస్తున్న తప్పుల గురించి సరిగ్గా తెలియక అలా అనుకుంటు ఉంటాం. అయితే తెలంగాణ బిజెపి నాయకులు మీద బజెపి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దీనిపై స్పందించారు. బిజెపి పార్టీ బలోపేతం చెయ్యండి, సభ్యత్వాన్ని భారీ నమోదు చెయ్యండి అంటే అంతా సూపర్ అంటూ ఊదరగొడుతున్నారు తెలంగాణ బిజెపి నాయకులు అందుకే అమిత్ షా అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. హైదరాబాద్ లో కూర్చుని అంతా చక్కగా ఉంది ఏం పర్వాలేదు అనుకుంటున్న తెలంగాణ బిజెపి నాయకులకు బాగానే క్లాస్ తీసుకున్నారు అమిత్ షా. మోదీ నాయకత్వంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టిసారించిన బిజెపి పార్టీ నాయకత్వం తెలంగాణ నేతల తీరు మీద మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారట.

తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే అదే సమయంలో దేశవ్యాప్తంగా మోదీ మానియా వీచిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి పట్టు లభించింది బిజెపికి. అయితే సీమాంధ్రలో కన్నా కూడా తెలంగాణలో ముందు నుండి పార్టీకి కాస్త పట్టెక్కువ.. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిజెపి పార్టీ మరింత బలపడుతుందని బిజెపి అధినాయకత్వం గట్టిగా నమ్మింది. కానీ ఆశించిన స్థాయిలో బిజెపి పార్టీ క్రియాశీలంగా లేదని అధినాయకత్వం మండిపడుతోంది. అంతకు ముందు కూడా తెలంగాణలో బిజెపి పార్టీకి ఒకటి రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునేంత సొంత బలం ఉంది. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లో కనీసం ఒకటి రెండు అప్పుడప్పుడు మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకునే అవకాశాలు బిజెపి పార్టీకి పుష్కలంగా ఉన్నాయి.

బిజెపి పార్టీకి తెలంగాణలో ఎంతో కొంత సాఫ్ట్ కర్నర్ ఉంది. అయితే ఆ యాంగిల్ ను బిజెపి పార్టీ వినియోగించుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. సభ్యత్వ నమోదులోనే కాకుండా పార్టీని కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో పార్టీ తెలంగాణ నాయకత్వం విఫలమవుతోందని అమిత్ షా భావిస్తున్నారు. అందుకే తెలంగాణ నాయకుల మీద తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ లో కూర్చొని అంతా సరిగ్గా ఉంది అనుకుంటే సరిపోదని అన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఇలానే ఉంటే 2019 నాటికి అధికారంలోకి ఎలా వస్తుందని కూడా అమిత్ షా ప్రశ్నించారు. అయితే తాజాగా కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారని ప్రకటించారు. అయితే కొత్త వారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించినా కానీ నిజానికి అధినాయకత్వం కిషన్ రెడ్డి పనితీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మరి తెలంగాణలో అమిత్ షా ఎలాంటి రాజకీయ చాణిక్యాన్ని ప్రదర్శిస్తారో చూడాలి.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Amith sha  Telangana  Kishan Reddy  Hyderabad  BJP Party in ap  BJP Leaders  

Other Articles