Controversial Director Ram Gopal Varma compares Pawan Palyan with cat | pawan kalyan speech

Ram gopal varma compares pawan kalyan with cat twitter

ram gopal varma, pawan kalyan, pawan kalyan speech, pawan kalyan beard photos, pawan kalyan updates, pawan kalyan photos, ram gopal varma twitter, varma twitter controversy, ram gopal varma twitter controversy, ram gopal varma updates, pawan with varma

Ram Gopal Varma compares pawan kalyan with cat : Controversial Director Ram Gopal Varma compares Pawan Palyan with cat. First he told that pawan is like a lion but he is talking like a cat.

‘సింహం’లాంటి పవన్.. ‘పిల్లి’లా మాటలేంటి? : వర్మ

Posted: 07/08/2015 09:42 AM IST
Ram gopal varma compares pawan kalyan with cat twitter

పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వివాదాస్పద పరిస్థితులపై స్పందించిన విషయం తెలిసిందే! అయితే.. ఈ ప్రసంగం సందర్భంగా పవన్ చెప్పిన వ్యాఖ్యానాల్లో అంతగా పసలేదని అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీడీపీతోపాటు టీఆర్ఎస్ నేతలు ఆయన మీద ఒంటికాలిపై లేవగా.. తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో పవన్ మీద ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. సింహంలా గర్జించాల్సిన పవన్.. పిల్లిలా మాట్లాడుతున్నారని ఆక్షేపించాడు. ట్విటర్ వేదికగా పవన్ పై వర్మ మంగళవారం సాయంత్రం ఇలా స్పందించాడు..

‘ఓటుకు నోటు వ్యవహారంలో పవన్ ప్రసంగించిన వీడియోని ఇప్పుడే చూశాను. పవన్ ఒక గర్జించే సింహం.. సింహం ఆలోచించి గర్జిస్తే ఆ గర్జనకు అర్థం లేదు. నిన్న (మంగళవారం) పవన్ ప్రసంగంలో నాకు అదే అనిపించింది. ఈ విషయం పవన్ కు బాగానే తెలుసనుకుంటాను. సింహం అర్థం చేసుకోవాల్సింది, సింహం ‘సింహం’లా వుండాలని.. తన గర్జనలోని అంతరార్థాన్ని కుక్కలను వివరించకూడదు. సింహం జూలో వుందనే భ్రమలో వున్నాయి కుక్కలు. కానీ కుక్కలు తెలుసుకోవాల్సింది.. సింహం తలచుకుంటే ఎప్పుడైనా దాడి చేయగలదని. సింహం గర్జనలోని అర్థాన్ని వెతకటం కుక్కల మొరుగుల్లో లాజిక్ వెతకడం లాంటిదే. సింహం ఆలోచించదు. కుక్కలు ఆలోచిస్తాయి. కానీ.. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే.. గర్జించే సింహం మేకలా మాట్లాడుతోంది.. సారీ పిల్లిలాగా మాట్లాడుతోంది’ అంటూ వర్మ ట్వీట్ చేశాడు. అంతేకాదు.. పవన్ కు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు వర్మ.

అదేమిటంటే.. ‘సింహంలాంటి పవన్ కల్యాణ్ కు నా సలహా.. దయచేసి పిల్లిలా వుండొద్దు. పులిలా గర్జించాలని మీ అభిమానులు కోరుకుంటున్నారు. మేకకి, మొక్కకు తేడా తెలియని సింహం.. అసలు సింహమే కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు వర్మ. గతంలో కూడా పవన్ కొన్నాళ్లపాటు సైలెంట్ గా వున్న నేపథ్యంలో ఈ విధంగా ఆయనపై ట్వీట్లు చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఈసారి ఆయన సింహంతో పోలుస్తూనే పిల్లి అని డైరెక్ట్ గా చెప్పేశాడు. మరి వర్మ చేసిన ఈ ట్వీట్లపై అభిమానులు ఎలా స్పందిస్తారో..? వర్మ ఇచ్చిన ఉచిత సలహాపై పవన్ ఏమంటారో..? వేచి చూడాల్సిందే!

Varma-tweets-on-Pawan-Image

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  pawan kalyan  twitter  

Other Articles