DS | D Srinivas | Congress | PCC | TRS | Telangana

Former congress senior leader ds joining the trs party today

DS, D Srinivas, Congress, PCC, TRS, Telangana

Former Congress senior leader DS joining the TRS party today. DS expect one more time PCC but congress high command didnt give the chance and also oofer mlc to lalitha. DS anger on congress and that time TRS give offer to DS.

కాంగ్రెస్ తో ఢీ- టిఆర్ఎస్ కు ఎస్.. నేడు డిఎస్ టిఆర్ఎస్ లో చేరిక

Posted: 07/08/2015 09:12 AM IST
Former congress senior leader ds joining the trs party today

ధర్మపురి శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు. అది నిన్నటి వరకూ. కానీ ఆయన జూలై 8న టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అన్నీ రెడీ చేసుకున్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో డీఎస్ గులాబీ కండువా కప్పుకుని కారెక్కి ఊరేగడానికి తెలంగాణ భవన్ లో ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి వివిధ పదవులు, అధికారాలు అనుభవించిన ఉమ్మడి రాష్ట్రంలో ఈ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి ఇప్పుడు తాను వన్స్-మోర్ అన్నా అధిష్టానం పట్టించుకోలేదని అలిగి అవతలి గూటికి చేరుతున్నారు. నిజానాకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది తానే అని చెప్పుకుంటున్న డీఎస్ ఇప్పుడు ఆ తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే అంటూనే, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంతో సాధించింది మాత్రం తప్పకుండా కేసీఆర్ అంటారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకురావడంలో పీసీసీ అధ్యక్షుడిగా తన పాత్ర ప్రముఖమైనదని చెప్పుకునే చెప్పుకునే డీఎస్ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఆనక ఎమ్మెల్సీగా అవకాశం పొంది మండలిలో ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా అనుభవించారు. ఆరు పదులు దాటేసిన వయస్సులో ఉన్న డీఎస్ కదలేకుండా, మెదలలేకుండా ఉన్నారు. అయినప్పటికీ తనకు వన్స్ మోర్ చాన్స్ కావాలన్నారు. డీఎస్ అభ్యర్థనను అధిష్టానం పట్టించుకోకపోగా ఆయన శిష్యురాలు ఆకుల లలితకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంతో అలిగారు. తాను అలిగిన విషయాన్ని మాత్రం పైకి చెప్పరు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చినా సరైన సమయంలో ఇవ్వలేదని, ఆలస్యం చేయడం వల్లే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సరైన గుర్తింపు రాలేదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. సోనియా గాంధీపై తనకు అత్యంత గౌరవం ఉందంటూనే బంగారు తెలంగాణ సాధన కోసమే తాను టీఆర్ఎస్-లో చేరుతున్నానంటూ చెప్పడం ఆయన రాజనీతిజ్ఞతకు తార్కాణం అనే అభిప్రాయాలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ విధానాలు మారిపోయాయన్నది, నాయకుల తీరు బాగా లేదన్నది ఆయన పార్టీ మారడానికి కారణంగా చెప్పుకోవడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ తనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకుంటూనే బీసీల అభివృద్ధి కోసం తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ చెప్పడంలో ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా రాహుల్ గాంధీ ‘యువరక్తం నినాదం’తో మరింక వృద్ధుడైన తనకు కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు దక్కకపోవచ్చనే అభిప్రాయంతో కూడా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణం కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DS  D Srinivas  Congress  PCC  TRS  Telangana  

Other Articles