Judiciary | Justice | Court | Telangana additional advocate general, Ramchander Rao

Telangana additional advocate general ramchander rao contraversial statements about the judiciary system

Judiciary, Justice, Court, Telangana additional advocate general, Ramchander Rao

Telangana additional advocate general Ramchander Rao contraversial statements about the Judiciary system. He said that some brokers spoils the Judiciary in India.

ITEMVIDEOS: న్యాయవ్యవస్థలో బ్రోకర్లున్నారా..? తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ వ్యాఖ్య

Posted: 07/04/2015 10:37 AM IST
Telangana additional advocate general ramchander rao contraversial statements about the judiciary system

న్యాయ వ్యవస్థలో అందరికి న్యాయం జరుగుతుంది.. అయితే ఒకరికి న్యాయం అనిపించింది మరోకరికి అన్యాయం అనిపిచవచ్చు. కానీ దేశ న్యాయవ్యవస్థ మీద ఎంతో మందికి చాలా నమ్మకం ఉంది. అయితే న్యాయ వ్యవస్థ మీద కొంత మంది రాజకీయ నేతలు తెలియక మాట్లాడటం తర్వాత నాలుక్కరుచుకోవడం జరిగింది. కానీ తాజాగా న్యాయ వ్యవస్థలో కీలక పదవిలో ఉన్న అదనపు అడ్వకేట్ జనరల్ స్థాయి వ్యక్తి న్యాయ వ్యవస్థకు సంబిందిన కొన్ని అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది చేసిందో ఎవరో కూడా కాదు తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావ్. అయితే అతను చేసిన వ్యాఖ్య మీద తలెత్తే పరిణామాలపై కూడా ముందుగా ఊహించి కూడా వ్యాఖ్యనించడం విశేషం.

న్యాయ వ్యవస్థపై తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సంచలానాత్మక కామెంట్లు చేశారు. బ్రోకర్స్ , పైరవీ కారులు న్యాయ వ్యవస్థలో ఉన్నంత వరకు నేరస్థులు, అవినీతి పరులు, దగాకోరులు పైలా పచ్చీసుగా రోడ్లపై తిరుగుతుంటారని అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు మండి పడ్డారు. రేవంత్ బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాన ఏసీబీ సుప్రీ కోర్టులో వేసిన పిటిషన్ ను సుప్రీం కొట్టి వేసిన నేపథ్యంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. తాను ఇలా మాట్లాదుతున్నందుకు కోర్టు ధిక్కరణ కింద నన్ను అరెస్టు చేసినా సరే నిజాలే మాట్లాడుతాను అని అన్నారు. అవసరమైతే రిక్షాతొక్కుతా లేదంటే బెండకాయలు అమ్ముకొని బతుకుతా కాని కాని నిజలు మాట్లాడకుండా ఉండను అని రామ చందర్ రావు అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అన్నది ప్రశ్న. రేవంత్ రెడ్డి కేసు సుప్రీంకోర్ట్ లో నడుస్తున్న కీలక సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ప్రాధాన్యతను పొందింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Judiciary  Justice  Court  Telangana additional advocate general  Ramchander Rao  

Other Articles