Finally Media blackmailers arrested by warangal district police | missed call trap

Media blackmailers arrested warangal district police

media blackmailers, india media blackmailers, gril trapping, business trap, men trap in women plan, rich people trap by girls, black mailers, police arrested, police investigations, warangal district.

Media blackmailers arrested warangal district police : Finally Warangal district police arrested media blackmailers who traps rich people and demands money in lakhs.

మిస్ట్ కాల్ ఇస్తారు.. అమ్మాయిని పంపుతారు.. ఆ తర్వాత?

Posted: 07/04/2015 10:13 AM IST
Media blackmailers arrested warangal district police

ఇండియాలో ఫోర్త్ ఎస్టేట్ గా గుర్తింపు పొందిన మీడియాని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. మీడియాని అడ్డం పెట్టుకుని డబ్బులను సులువుగా సంపాదించాలన్న ఉద్దేశంతో బడాబాబులను టార్గెట్ చేయడం, వారిని తమ ట్రాప్ లో పడేయడం, తర్వాత బెదిరింపులకు పాల్పడడం లాంటివి చేస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకోగా.. తాజాగా మీడియా ముసుగులో బ్లాక్ మెయిల్ కి పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల బృందం తతంగం బయటపడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎప్పుడూ వినని టీవీ చానెళ్ల పేర్లు చెబుతూ ఓ ముఠా.. బడాబాబులను టార్గెట్ చేస్తూ వచ్చింది. ఈ ముఠాలోని ఓ వ్యక్తి.. సమాజంలో పేరున్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ కు మిస్ట్ కాల్ ఇస్తాడు. తిరిగి వారు ఫోన్ చేయగా.. ఇటువైపు నుంచి ఓ అమ్మాయి మాట్లాడుతుంది. మాటలతో సదరు వ్యక్తులను ట్రాప్ చేయడమే ఆమె పని. ఒకసారి పరిచయం అయిన తర్వాత ఆమె తిరిగి పదేపదే ఆమె ఫోన్ చేస్తుంటుంది. అలా వారి మధ్య ఏర్పడిన ఆ మాటల పరిచయం బేకరీలు, స్టార్ హోటళ్ల దాకా వెళుతుంది. చివరకు సదరు వ్యక్తి, యువతిని సీక్రెట్ గా కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తారు. వారిద్దరు కలిసి లాడ్జికి వెళ్లగానే.. క్షణాల్లో ఆ ముఠా రంగంలోకి దిగుతుంది. వారిద్దరు లోపలి గడియ వేయగానే.. వీరు బయటి నుంచి తలుపు కొడతారు. వారు తలుపులు తీయగానే.. ఇద్దరినీ కెమెరాలో చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ఆ వీడియోలను తమ టీవీ చానళ్లో వేస్తామని బ్లాక్ మెయిలింగ్ కి దిగుతారు. రూ.లక్షల్లో డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తారు.

ఆ ముఠా కెమెరాలను రెండు విధాలుగా అమరుస్తారు. ముందుగా తాము ఎంచుకున్న గదికి సదరు వ్యక్తి వచ్చేందుకు సిద్ధంగా వుంటే.. ఆ గదిలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అప్పుడు కెమెరాల్లో రికార్డ్ అయిన అంశాన్ని చూపెట్టి భయపెడతారు. ఇక రెండో విధానంలో.. సదరు వ్యక్తి చెప్పిన చోటుకి అమ్మాయి వెళ్లాల్సి వస్తే.. సీక్రెట్ కెమెరాలతో సిద్ధంగా వుండి గదిలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే ఆ ముఠా ఎంట్రీ ఇస్తుంది. ఇలా చిత్రీకరించిన తర్వాత వాటిని తమ చానెళ్లలో ప్రసారం చేస్తామని బెదిరిస్తారు. బేరసారాలకు దిగి, లక్షల్లో డిమాండ్ చేసి గుంజుతారు. ఇలా వీరి చేతికి కేయూకు చెందిన ఓ ప్రొఫెసర్ చిక్కి ఎన్నో లక్షలు సమర్పించుకున్నాడు. ఇలా ఈ విధగా ఎంతోమంది బడాబాబులను ఆ ముఠా ట్రాప్ చేసి.. కోట్లను పడగెత్తారు. ఈ రకంగానే ఓ వ్యక్తిని ఈ ముఠా ట్రాప్ చేయబోయి.. అడ్డంగా దొరికిపోయింది.

ఆ వివరాల్లోకి వస్తే.. ఈ ముఠా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ట్రాప్ చేసింది. వీరి ప్లాన్ ప్రకారమే.. ఫోన్ చేయడం, అమ్మాయిని పంపండం, మిగిలిన వ్యవహారమంతా పూర్తై.. చివరకు అతగాడు వారి కెమెరాలకు చిక్కాడు. దీంతో ఆ బృందం వ్యక్తులు అతనికి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. అతగాడు వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తెలివిగా తమ మధ్య జరిగిన సంభాషణలను రికార్డు చేసి పెట్టుకున్నాడు. ఇదిలావుండగా.. ఇతని వ్యవహారం గురించి ఓ చానల్ లో స్ర్కోలింగ్ వచ్చింది. అది చూసిన ఇతగాడు పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. శుక్రవారం ఆ ముఠా వ్యక్తుల్ని వరంగల్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Media  Blackmailers  police investigation  people trap  

Other Articles