Congress senior leader questions pawan kalyan | janasena party | cash for vote | phone tapping | V hanumantha rao

Congress senior leader questions pawan kalyan janasena party cash for vote phone tapping

pawan kalyan, janasena party, pawan kalyan updates, pawan kalyan latest news, pawan kalyan photo gallery, pawan kalyan beard, v hanumantha rao, vh news, congress leaders, congress party, congress sernior leader vh, ysr congress party news

Congress senior leader questions pawan kalyan janasena party cash for vote phone tapping : Congress senior leader V Hanumantha rao questions Pawan kalyan to answer on vote for cash and phone tapping controversies. Otherwise he will protest infront of pawan's house.

పవన్ పై గుర్రుగా వున్న ఆ ‘నేత’ ఎవరు?

Posted: 06/30/2015 09:29 AM IST
Congress senior leader questions pawan kalyan janasena party cash for vote phone tapping

పవర్ స్టార్, జనసేనాధిపతి అయిన పవన్ కల్యాణ్ పై ఓ నేత చాలా ఆవేశంగా వున్నారు. నిన్నటివరకు మీడియా ముందుకు రావడానికి కాస్త తడబడిన ఆయన.. ఇప్పుడు పవన్ కోసం ముందుకు వచ్చారు. తాను పవన్ ఇంటికివెళ్లి ఆయన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతానని.. అందుకు తగిన సమాధానం ఇవ్వకపోతే ఇంటిముందే బైఠాయించి, నిరసన చేస్తానని వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ నేత ఎవరు? అని అనుకుంటున్నారా! మరెవరో కాదు.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు.

మరో రెండు మూడురోజుల్లో తాను పవన్ ఇంటికి వెళ్లి కొన్ని ప్రశ్నలు అడుగుతానని.. అందుకు తగిన సమాధానం ఆయన ఇవ్వకపోతే ఇంటిముందే బైఠాయిస్తానని వీహెచ్ పేర్కొన్నారు. ఎందుకంటే.. ‘రాష్ట్రంలో ఎక్కడైనా తప్పు, అవినీతి జరిగితే దానిని రూపుమాపేందుకు ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తా’ అని గత ఎన్నికల సందర్భంగా చెప్పిన పవన్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ్యవహారాలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. అప్పట్లో ప్రగల్భాలు పలికిన పవన్.. ఇప్పుడెందుకు మౌనం వహిస్తూ కూర్చుండిపోయారని వీహెచ్ ప్రశ్నించారు.

గతఎన్నికల్లో బాబుకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్.. ఇప్పుడు వారి అవినీతిపై స్పందించాలని ఆయన కోరారు. చంద్రబాబు బండారం రేవంత్ రెడ్డి రూపంలో బయటపడ్డప్పటికీ.. ఇంతవరకు ఒప్ప ప్రశ్న కూడా పవన్ వేయలేదని వీహెచ్ ఆరోపించారు. టీడీపీ పాల్పడిన అక్రమాలపై పవన్ స్పందించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ట్విటర్ వేదికగా తాను మరో రెండు రోజుల్లో ‘పోన్ ట్యాపింగ్’, ‘ఓటుకు నోటు’ వ్యవహారాల్లో మాట్లాడుతానని పవన్ పేర్కొన్న సందర్భంలో వీహెచ్ ఈ విధంగా ఆయన మీద విరుచుకుపడటం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అటు.. కాంగ్రెస్ నేతలతోపాటు వైకాపా నేతలు సైతం పవన్ ట్వీట్లపై తమదైన శైలిలో కౌంటర్ వేశారు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్.. ఇప్పుడు ఎందుకు నోదు మెదపడం లేదంటూ తిరిగి పవన్ నే ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వైకాపా, కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా పవన్ పై ప్రశ్నలదాడి చేయడంపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena party  v hanumantha rao  

Other Articles