Earthquake of 5 magnitude rocks Nepal on Monday for 2 times | nepal earthquake | India

Earthquake of 5 magnitude rocks nepal on monday for 2 times

nepal earthquake, earthquake tremors, nepal earthquake tremors, world donates nepal, nepal latest news, nepal crime news, earthquake tremors in nepal, earthquake in india

Earthquake of 5 magnitude rocks Nepal on Monday for 2 times : A 5-magnitude and 3.3 magnitude mild earthquake tremor on Monday rocked Nepal, triggering panic among the people already battered by the two devastating earthquakes two months ago and over 330 aftershocks.

‘భూకంపం’తో మళ్లీ కంపించిన నేపాల్

Posted: 06/29/2015 05:35 PM IST
Earthquake of 5 magnitude rocks nepal on monday for 2 times

రెండు నెలలక్రితం నేపాల్ ను అతలాకుతలం చేసిన వరుస భూకంపాలు.. ఇప్పటికీ ఆ దేశాన్ని వదిలిపెట్టడం లేదు. అప్పుడు తొమ్మిది వేల మందిని పొట్టనపెట్టుకున్న ఈ భూకంపం.. ఇంకా అక్కడి ప్రజల్ని భయాభ్రాంతులకు గురిచేస్తోంది. ఆమధ్య భారీ భూకంపం సంభవించిగా.. ఆ తర్వాత 343 సార్లు 4 అంతేకంటే ఎక్కువ తీవ్రతతో మళ్లీ భూకంపాలు వచ్చాయి. ఇలా ఎడతెరిపి లేకుండా నేపాల్ ను దద్దరిల్లిస్తున్న ఈ భూకంపం.. తాజాగా సోమవారంనాడు మళ్లీ రెండుసార్లు సంభవించింది.

సోమవారం ఉదయం 5.2 తీవ్రతతో నేపాల్ లో భూమి కంపించగా.. మళ్లీ మధ్యాహ్నం 3.3 తీవ్రతతో కంపించింది. ఈ విధంగా సంభవించిన ఈ భూకంపం నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 150 కిలోమీటర్ల దూరంలో వచ్చిందని భూకంప కేంద్ర అధికారులు వెల్లడించారు. ఇటువంటి స్వల్ప భూకంపాలు మరిన్ని సంభవించే అవకాశాలు వున్నాయని.. అందుకు తగిన సూచనలు కూడా కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. అందుకే.. ప్రజలంతా నిత్యం అప్రమత్తంగా వుండాలని వారు ముందుగానే హెచ్చరించారు. కాగా.. సోమవారం సంభవించిన భూకంపం ధాటికి ఎంత ప్రాణ, ఆస్తినష్టం జరిగిందో నేపాల్ ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. భూకంప తీవ్రతను బట్టి చూస్తే.. ఆస్తినష్టం భారీగానే జరిగి వుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రాణనష్టం ఎక్కువగా జరిగి వుండకూడదని ఆశిస్తున్నారు.

ఇదిలావుండగా.. భూకంపం ధాటికి అతలాకుతమైన నేపాల్ కు గతవారం ప్రపంచ దేశాలు ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే! ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీ నేపాల్ కు ఒక బిలియన్ ప్యాకేజ్ ఆర్థికసహాయం అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఒకవైపు ప్రపంచదేశాలు ఆర్థిక సహాయం అందిస్తుంటే.. మరోవైపు ప్రకృతి ప్రకోపం నేపాల్ ను తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఈ భూకంపాల ధాటి నుంచి నేపాల్ ఎప్పుడు బయటపడుతుందో..? అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nepal  earthquake  india  

Other Articles