Digvijay singh | CBI | Chandrababu | KCR | cash for vote | Tapping

Congress senior leader digvijay singh demand for cbi investigation in the tapping and cash for vote

Digvijay singh, CBI, Chandrababu, KCR, cash for vote, Tapping

Congress senior leader Digvijay singh demand for CBI investigation in the Tapping and cash for vote. He said that KCR, Chandrababu naidu trying to escape from the problems.

ఓటుకు నోటు, ట్యాపింగ్ పై సిబిఐ విచారణ ..!

Posted: 06/29/2015 08:01 AM IST
Congress senior leader digvijay singh demand for cbi investigation in the tapping and cash for vote

ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌లపై ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రుల దాటవేత వైఖరి అవలంబిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏమో ఓటుకు నోటు కేసుతో తనకు సంబంధం లేదని చెప్పడం లేదు, అలాగే కేసీఆర్‌, ఫోన్‌ ట్యాపింగ్‌లపై స్పందించడం లేదంటూ వారిద్దరి వైఖరిని తూర్పారబట్టారు. తక్షణమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రెండు కేసులపైన సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్రానికి లేఖలు రాయాలని కాంగ్రెస్‌ నేత డిగ్గీ రాజా డిమాండ్‌ చేశారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఈ కేసును పర్యవేక్షించేలా చూడాలని ఆయన కోరారు. అలా కానీ పక్షంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్‌ పార్టీ కమిటీలు ఈ కేసులపై న్యాయపోరాటం చేస్తాయని ఆయన హెచ్చరించారు.

ఐపిఎఎల్‌ మాజీ చైర్మన్‌ లలిత్‌ మోడీని విదేశాలకు పంపించే విషయంలో జరిగిన అక్రమాలు ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పూర్తిగా తెలుసని దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. 15 రోజులుగా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రధాని మౌనంగా ఉండటం ద్వారా లలిత్‌మోడీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిం చారు. నరేంద్రమోడీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయం లోనే వీరి మధ్య సంబంధాలు ఉన్నాయన్నారు. కేసుల్లో ఉన్న లలిత్‌ మోడీ దేశం దాటిపోయేందుకు సుష్మాస్వరాజ్‌ సహకరించారన్నారు. ఈ విషయాన్ని ఆమె అంగీకరిస్తున్నారని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమని కాంగ్రెస్‌ నేత అన్నారు. నిబంధనలు ఉల్లఘించి, చట్టాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయాలు ప్రధాన మంత్రికి తెలిసి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అలాగే రాజస్దాన్‌ ముఖ్యమంత్రి వసుంధరరాజే సింధియా అక్రమాలకు పాల్పడినట్లుగా ఆధారాలు ఉన్నా ఆమెపై ఎటువంటి చర్య తీసుకోలే దన్నారు. అవినీతి రహిత పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ఏడాది పాలనలోనే బీజేపీ వైఖరి బయటపడిందన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Digvijay singh  CBI  Chandrababu  KCR  cash for vote  Tapping  

Other Articles