vasundhara raje returns to jaipur without meeting bjp top brass

Insult to bjp chief minister as party top brass doesn t gives appointment

Raje Leaves Delhi Without Meeting BJP Top Brass, rajasthan, cm, vasundhara, raje, leaves, delhi, without, meeting, bjp, top, brass, india, lalit modi, narendra modi, niti aayog, BJP chief Amit Shah, modigate, vasundhara raje, bjp high comand, Narendra modi

Embattled Rajasthan Chief Minister Vasundhara Raje today attended a NITI Aayog deliberation here but left the capital without meeting either Prime Minister Narendra Modi or BJP chief Amit Shah.

హస్తినలో సీఎంకు పరాభవం.. ముఖం చాటేసిన పార్టీ పెద్దలు..

Posted: 06/27/2015 10:38 PM IST
Insult to bjp chief minister as party top brass doesn t gives appointment

ఐపీఎల్ ఆర్థిక నేరాలకు, నిధుల మళ్లింపు కేసులో అభియోగాలు ఎదుర్కోంటు లండన్ లో తలదాచుకున్న లలిత్ మోడీ వ్యవహరాంలో పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఒంటరయ్యారు. కేంద్ర మంత్రి సుష్మ సర్వాజ్ కు అండగా నిలిచిన అగ్రనేతలు తనకు కూడా అండగా వుంటారని భావించిన వసుందర రాజేకు పార్టీలో పరాభవం ఎదురైంది. అమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిరాకరించారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె పార్టీ అధిష్టానాన్ని, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించారు.

అయితే వసుంధరతో భేటీ అయ్యేందుకు ప్రధాని సహా, అమిత్ షా విముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో వసుంధర నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే తిరిగి రాజస్థాన్‌కు బయలుదేరారు. స్వయంగా సీనియర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ అమెను సమర్థిస్తూ రాజస్థాన్ లో మీడియాకు వెలువరించిన తరువాత.. కాంగ్రెస్ పార్టీ వసంధర రాజే.. లలిత్ మోడీకి తన సిఫార్సులను తెలుపుతూ బ్రిటెన్ ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిన డాక్యూమెంట్లు విడుదల చేయడంతో.. అమెపై మరింత ఒత్తడి పెరిగింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : modigate  vasundhara raje  bjp high comand  Narendra modi  

Other Articles