BJP notice to MLA Raj Purohit as sting leaves party red faced

Its not my voice in that tapes iam ready for forensic test

BJP notice to MLA Raj Purohit as sting leaves party red faced, raj purohit, lodha builders, Devendra Fadnavis, raj thackeray, mns, Narendra modi, Amit Shah, RSS

Video from a sting operation on its Maharashtra legislative party chief whip Raj Purohit surfaces in which he levels a series of allegations and spares no one

ITEMVIDEOS: ఆ టేపుల్లో వాయిస్ నాది కాదు.. ఫోరెన్సిక్ పరీక్షలకు సిద్దం..!

Posted: 06/27/2015 10:41 PM IST
Its not my voice in that tapes iam ready for forensic test

ప్రధాని నరేంద్రమోడీపై వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాజ్ పురోహిత్ కు బిజేపి నోటీసులు జారీ చేసింది. వ్యాఖ్యల విషయమై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో కోరింది. ప్రధాని మోడీ సహా బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపైనా మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవిస్ పైనా పురోహిత్ చేసిన విమర్శలు వెలుగుచూశాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర పార్టీ నేతలు సదరు వీడియోను జాతీయ పార్టీకి పంపింది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ అధినాయకవ్తం పురోహిత్ కు నోటీసులు జారీ చేసింది. పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, మోడీ, అమిత్ షాలే అధికారాన్ని గుప్పిట పెట్టుకుని వ్యవహరిస్తున్నారని పురోహిత్ వ్యాఖ్యానించినట్లుగా అభియోగాలను ఎదుర్కోంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫెడ్నవిస్ కూడా నిస్సహాయకుడిగా మారిపోయారని, అధినాయకత్వం ఒత్తళ్ల కారణంగా ఏం చేయలేకపోతున్నారని పురోహిత్: విమర్శించినట్లు వీడియో వెలుగుచూసిన విషయం తెలిసింది.

అయితే తన వీడియో వ్యాఖ్యలపై క్రమశిక్ష్ణ ఉల్లంఘణ చర్యలు చేపట్టాలని భావించిన, రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు రావ్ సాహెబ్ దాన్వేకు మూడు రోజుల్లోగా రాత పూర్వక వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులలో పార్టీ అధిష్టానం పేర్కోంది. కాగా, దీనిపై స్పందించిన పురోహిత్.. ఆ వీడియో టేపుల్లో వున్నది తన స్వరం కాదని స్పష్టం చేశారు. దీనిపై పార్టీ అధిష్టానికి అనుమానాలు వుంటే.. ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాలని కూడా ఆయన సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raj purohit  lodha builders  Devendra Fadnavis  raj thackeray  mns  

Other Articles