Balakrishna conducts Praja Durbar | Nandamuri Balakrishna| Praja Durbar| Hindupur Constituency

Balakrishna conducts praja durbar

Balakrishna conducts Praja Durbar, MLA Nandamuri Balakrishna, actor balakrishna, hindupur mla balakrishna, Hindupur constituency, Praja Durbar, personally received many complaints, anathapur district officials, resolve their problems.

MLA Nandamuri Balakrishna visited Hindupur constituency on Wednesday and also conducted a Praja Durbar. He personally received many complaints from the people and asked the district officials, to resolve their problems.

బాలయ్య ప్రజా దర్భార్ కు అనూహ్య స్పందన..

Posted: 06/24/2015 05:45 PM IST
Balakrishna conducts praja durbar

నందమూరి నటసింహం.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తమను మర్చిపోయాడని, ఆయ నిత్యం సినిమాల్లోనే బిజిగా వుండటం వల్ల నియోజకవర్గ సమస్యల పరిష్కారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు వున్నాయని నియోజకవర్గ ప్రజలు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించండంతో.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇవాళ ఆయన తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. అంతేకాదు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిస్కారం కోసం ప్రజా దర్భార్ కూడా నిర్వహించారు.

స్థానికంగా వున్న సాయిరాం ఫంక్షన్‌ హాలులో నందమూరి బాలకృష్ణ నిర్వహఇంచిన ప్రజాదర్బార్‌ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజలు వందలాదిగా ప్రజాదర్భార్ కు తరలివచ్చారు. బాలకృష్ణ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరించారు. హిందూపురం పట్టణంలో ఉన్న సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకొని అధికారులతో చర్చించి, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం కూడా ప్రజాదర్బార్‌ను కొనసాగిస్తానని బాలకృష్ణ చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తానన్నారు. ఈ ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు జిల్లా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  Praja Durbar  Hindupur Constituency  

Other Articles