Jawaharlal Nehru | Rajendra Prasad | RNP Singh | Nehru: A Troubled Legacy | lying

Jawaharlal nehru lied to stop rajendra prasad as president book

Jawaharlal Nehru, former intelligence officer RNP Singh, Nehru: A Troubled Legacy, Rajendra Prasad, RNP Singh, president after the country's independence, safest and best course, C Rajagopalachari, deep disappointment, first president of India, September 10, 1949, Sardar Vallabha bhai Patel

The book, written by former intelligence officer RNP Singh, says: “Nehru had resorted to desperate measures to prevent Prasad from occupying the position of president and these measures included blatant lying.”

రాజేంద్రుడిని తొలి రాష్ట్రపతి కాకుండా అబద్దాలతో అడ్డుకున్నారు..

Posted: 06/24/2015 04:36 PM IST
Jawaharlal nehru lied to stop rajendra prasad as president book

భారత రాజకీయాల్లో మరో రహస్యం వెలుగుచూసింది. దేశంలో ఎవరు అధికారంలో వున్నా.. ప్రతిపక్షాలకు చెందిన పలు విషయాలను వెలుగులోకి తీసుకురావడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా మారిపోతోంది. ఈ నేపత్యంలో భారత్ తొలి రాష్ట్రపతిగా రాజగోపాలాచారిని నియమించేందదుకు అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ.. అబద్దాలు కూడా ఆడారని ఇటీవల ఓ పుస్తకం వెలుగులోకి తీసుకువచ్చింది. స్వతంత్ర భారతవని తొలి రాష్ట్రపతిగా ఖ్యాతినందుకుంటున్న రాజేంద్రప్రసాద్‌ను ఆ పదవిలో నియమించడం ప్రధాని నెహ్రూకు ఇష్టం లేదని ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారి ఆర్ఎన్‌పీ సింగ్ ‘నెహ్రూ: ఎ ట్రబుల్డ్ లెగసీ’ అనే పుస్తకంలో వెల్లడించారు. తొలుత భారత ప్రథమ రాష్ట్రపతిగా సీ రాజగోపాలచారికి అవకాశమివ్వాలని నెహ్రూ భావించారట. ఈ విషయాన్ని సెప్టెంబర్ 10 1949లో రాజేంద్రప్రసాద్‌కు రాసిన లేఖలో నెహ్రూ పేర్కొన్నారని ఆ పుస్తకంలో రాశారు.

‘భారత తొలి రాష్ట్రపతిగా రాజగోపాలాచారి అయితేనే మంచిదని నేను, సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయించామని నేహ్రూ రాజగోపాలాచారికి ఓ లేఖ రాశారు. అది చదివి తీవ్ర అసంతృప్తికి, వేదనకు గురైన రాజేంద్రప్రసాద్.. తన భాదను వ్యక్తం చేస్తూ.. పటేల్‌కు లేఖ రాశారు. దానితోపాటు నెహ్రూ రాసిన ఉత్తరాన్ని కూడా దానికి జత చేశారు. ఈ లేఖ చదివి పటేల్ ఆశ్చర్యపోయారు. తనతో ఎప్పుడు రాష్ట్రపతి పదవి గురించి నెహ్రూ చర్చించలేదని వాపోయిన సర్థార్ పటేల్‌.. ఆవిషయాన్ని పక్కన బెట్టి. నెహ్రూకు లేఖ రాస్తూ.. పార్టీలో ఎంతో సీనియరైన రాజేంద్ర ప్రసాద్‌తో మరింత హుందాగా ప్రవర్తించి ఉంటే బాగుండేదని సూచించారు. ఈ లేఖ చదివిన నెహ్రూ.. పరిస్థితి తన చేయి దాటిపోతోందని భావించారు. పటేల్, ప్రసాద్‌ల దృష్టిలో తాను చులకనైపోయానని భావించారు. అనంతరం పరిస్థితిని అంతా వివరిస్తూ రాజేంద్రప్రసాద్‌కు ఓ లేఖ రాశారు. ఇక ఈ విషయంలో వేలు పెట్టడం ఇష్టం లేక రాష్ట్రపతి బాధ్యతను పటేల్‌ చేతిలోనే నెహ్రూ పెట్టార’ని ఆ పుస్తకంలో సింగ్ రాసుకోచ్చారు.

అయితే అందరూ దేశం కోసం పోరాడిన యోధులే. తమ యవ్వన దశ నుంచి దేశానికి స్వాతంత్ర్యం కావాలని ఉద్యమించిన నాయకులే. అయితే వారిలో వారికి పొరపచ్చాలు లేకపోవచ్చు. అయితే ఒకరిపై అధిక చనువు, మరోకరితో కొంత కలుపుగోలు తనం, ఇంకోందరితో పరిమితమైన పరుధుల లోపు మాత్రమే స్నేహాలు వుండవచ్చు. అయితే తన అనుకున్న వారికి పదవి లభించేందుకు అప్పట్లోనూ నేతలు యత్నాలు చేసివుండవచ్చు. అయితే వారు లేని సమయంలో, తిరిగి వచ్చి సంజాయిషీ ఇచ్చుకోలేరని తెలిసిన పరిస్థితులలో ఇలాంటి విషయాలను వెలుగులోకి తీసుకోచ్చి.. స్వతంత్ర్య సమరయోధులకు పరాభవం కలిగేలా రచనలు చేయడం ఎంతవరకు సమంజసమో.. రచయితలకే తెలియాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jawaharlal Nehru  Nehru: A Troubled Legacy  Rajendra Prasad  RNP Singh  

Other Articles