22-Year-Old Woman Allegedly Gang-Raped by 7 in Gurgaon

Jobseeker gang raped in gurgaon

jobseeker gang-raped in Gurgaon, Gangrape, sexual harassment, Gurgaon rape, sexual assault, Gurgaon, woman, raped, seven men, guesthouse, Gurgaon, guest house, Rape, Jobseeker, Gang-rape, crime against women, harrassment against women, gang rape on women, Gang-Raped in Gurgao

A 23-year-old woman was raped by seven men at a guesthouse in Gurgaon's DLF-IV on Wednesday after one of them took her there, promising a job in his "office"

నయవంచన.. ఉద్యోగం ఇస్తానని చెప్పి గ్యాంగ్ రేప్..

Posted: 06/20/2015 08:42 PM IST
Jobseeker gang raped in gurgaon

పశ్చిమ బెంగాల్‌ మరో దారుణం జరిగింది. తన కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మ బలికిన ఓ మగమృగం.. అవసరంలో వున్న 22 ఏళ్ల యువతిపై తన ఆరుగురు మిత్రులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం రోజు జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  గుర్గావ్లోని ఓ గెస్ట్హౌస్లో బుధవారం ఈ దారుణం జరిగింది.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నిందితుల్లోని  ఓ వ్యక్తి  మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు.   

కార్యాలయానికి తీసుకు వెళుతున్నానని  చెప్పి, ఆమెను  గెస్ట్‌హౌస్‌కు తీసుకువెళ్లాడు.  అప్పటికే సదరు గెస్ట్ హౌజ్ లో వున్న అతని ఆరుగురు స్నేహితులతో కలసి నిరుద్యోగ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ జరిగిన ఘోరాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై  కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళ  ఫిర్యాదు  ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.  భర్తతో విభేదాల కారణంగా  వేరుగా ఉంటోంది. తన కొడుకును పోషించుకోవడానికి,  ఉపాధి కోసం రెండు సంవత్సరాల క్రితం గుర్గావ్‌కు  వెళ్లినట్టు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  raped  seven men  guesthouse  Gurgaon  

Other Articles