Manohar Parrikar: 70000 houses under MAP to be finished by 2018

Will not speak to media for 6 months defence minister manohar parrikar

Will Not Speak to Media For 6 Months, Manohar Parrikar, Panaji, Parrikar controversy, Rafale deal, Sopore, Kashmir news, Defence Minister Manohar Parrikar, criticism, not speak to media

Defence Minister Manohar Parrikar, who has faced criticism in the media for his comments on a wide range of issues, on Saturday said he would not speak to the media for six months

ఆరు మాసాల పాటు మీడియాతో పారికర్ మౌనవ్రతం

Posted: 06/20/2015 08:35 PM IST
Will not speak to media for 6 months defence minister manohar parrikar

కేంద్ర రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ అలిగారు. గోవా ముఖ్యమంత్రిగా ఆయన పనులను, పథకాలను పతాక శీర్షికన పెద్దగా ప్రచారం చేసిన మీడియాపైనే అలిగారు. ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా సుమారుగా ఏడాది కాలం పాటు ఆయనను తలకెత్తుకున్న మీడియా.. ఆయన ఒక్కసారిగా విమర్శిస్తూ కథనలాను ప్రచురిండంతో.. తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్న ఆయన.. మీడియాకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు. అది ఎంతలా అంటే.. ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు మాసాల పాటు మీడియాతో మాట్లాడబోనని ఖరాఖండిగా చెప్పేశారు. తన సోంత రాష్ట్రంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

గత కొద్ది కాలంగా మీడియాలో పారికర్ మాట్లాడే ప్రతీ మాటా వివాదాస్పదం అవుతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా గోవా పర్యటనలో ఉన్న పారికర్ శనివారం మీడియాతో మాట్లాడారు. తన మాటలు వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో కొంతకాలం పాటు మీడియాతో మాట్లాకపోవటమే మంచిదని భావిస్తున్నట్లు పారికర్ ప్రకటించారు. అయితే ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, ఉగ్రవాదులను ఉగ్రవాదులతోనే మట్టుపెట్టాలని రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నిర్ణయంపై కూడా విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రిగా, అందులోనూ అత్యంత కీలకమైన దేశ రక్షణ శాఖ బాధ్యతలను మోస్తున్న మంత్రి మనోహర్ పారికర్.. దేశ రక్షణకు సంబంధించిన అంశంలో.. ఏ విషయాన్ని ఇక మీడియాతో పంచుకోకూడదని నిర్ణయం తీసుకోవం ఎంత వరకు సమంజసమని పలు మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manohar Parrikar  criticism  media  6 months  

Other Articles