Fishes | Fallen | Sky | Rain

Fishes fallen from the sky while rain in krishna dist

Fishes, Rain, Krishna dist, nandigama, Gollapudi, Vallagiri

Fishes fallen from the sky while rain in Krishna dist. In krishna dist. Nandigama mandal Gollapudi, Vallagiri villages, fishes fallen from the rain. The villagers and fermers very excited about the incident.

ITEMVIDEOS: కృష్ణా జిల్లాలో చేపల వర్షం

Posted: 06/20/2015 09:24 AM IST
Fishes fallen from the sky while rain in krishna dist

ఆకాశం నుండి వర్షం పడటం సహాజం. అయితే వర్షంలో వడగళ్లు పడటం అప్పుడప్పుడు జరుగుతుంది. అదే ఆకాశం నుండి చేపలు పడితే ఎలా ఉంటుంది. అదేంటి వర్షంతో పాటు చేపలు కూడా ఎలా పడతాయి..? అలా ఎక్కడైనా జరుగుతుందా..? అని అడిగితే మాత్రం అవును, అలా కృష్ణా జిల్లాలో జరిగింది అన్న సమాధానం వస్తుంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం గొళ్లపూడి, వల్లగిరి గ్రామాల పొలాల్లో ఆకాశం నుండి చేపల వర్షం కురిసింది. రాత్రి కురిసిన కుండపోత వర్షంతో పాటుగా ఆకాశం నుండి చేపలు కూడా పడ్డాయని అక్కడి వారు సమాచారం అందుకున్నారు. దాంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు పొలాల్లో నీళ్లు ఆగి ఉండటం.. ఆ నీళ్లలో చేపలు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇంకేముందు అందినంత, అవసరమైనంత వరకు చేపలు ఇళ్లకు పట్టుకుపోయారు. చేపల వర్షం వార్త అందుకున్న చుట్టుపక్కలి గ్రామస్తులు కూడా అక్కడి చేరుకొని ఆశ్చర్యపోతున్నారు.

అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు మన దగ్గర జరగలేదు కానీ వేరే దేశాల్లో మాత్రం చాలానే జరిగాయి. ధాయ్ లాండ్ లో, అమెరికాలో కూడా ఆకాశం నుండి చేపలు పడ్డాయి. అయితే ఇలా ఎలా సాధ్యం అని ఆలోచించే వారికి సమాధానం కూడా ఉంది అంటున్నారు సైంటిస్టులు. సుడిగాలులు చెరువులు, కుంటలు లాంటి వాటి మీద ఏర్పడినప్పుడు అక్కడి నీళ్లు, చేపలు ఆకాశంలోకి చేరతాయని, అక్కడి నుండి వర్షం కురిస్తే వర్షంతో పాటుగా చేపలుపడతాయని అంటున్నారు. చేపలు, వానపాములు, సాలె పురుగులు కూడా పడుతూ ఉంటాయని వారు అంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fishes  Rain  Krishna dist  nandigama  Gollapudi  Vallagiri  

Other Articles