Yanamala | Jagan | KCR | Stephenson

Ap minister yanamala ramakrishnudu questioned jagan and kcr

Yanamala Ramakrishnudu, Jagan, stephenson, Harish Rao, Revanth Arrest, KCR

Ap minister Yanamala Ramakrishnudu questioned Jagan and KCR. He asked 24 questions to both Jagan and KCR. He said that Jagan, stephenson and Harish Rao met before the Revanth Arrest.

జగన్, హరీశ్, స్టీపెన్ సన్ భేటీ అయ్యారా..? లేదా..?

Posted: 06/20/2015 08:52 AM IST
Ap minister yanamala ramakrishnudu questioned jagan and kcr

తెలుగు రాష్ట్రాల మధ్య వేడిని రాజేసిన ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చెయ్యడానికి ముందు జగన్, హరీష్, స్టీఫెన్ సన్ ఓ రహస్య ప్రదేశంలో భేటీ అయ్యారంటూ ఏపి మంత్రి యనమల బాంబ్ పేల్చారు. ఈ భేటీలోనే చంద్రబాబు నాయుడు వీద రాజకీయ కుట్రకు తెర తీశారని యనమల ఆరోపించారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ టీడీపీ అధికారంలోకి వస్తుందని భావించిన కేసీఆర్‌, ఏపీలో తమ పునాదులు కదులుతాయన్న భయంతో జగన్‌.. కలసి కుట్ర పన్నిన ఫలితమే రేవంత్‌ వ్యవహారమని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌ ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందేనని.. రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసిన కేసీఆరే రాజ్యాంగ విరుద్ధంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించడం పెద్ద నేరమని యనమల అన్నారు. ట్యాపింగ్‌ చేసినట్టు తెలంగాణ హోం మంత్రే స్వయంగా ప్రకటించారని తెలిపారు.  కేసీఆర్‌, జగన్‌ కలిసి టీడీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేందుకు కుట్ర పన్నారని యనమల ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు, జగన్‌కు 24 ప్రశ్నలను యనమల సంధించారు. దమ్ముంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు.
 
యనమల కేసీఆర్, జగన్ లను అడిగిన ప్రశ్నలు..

* రేవంత్‌ ఘటన జరగడానికి కొద్దిరోజుల ముందు జగన్‌, హరీశ్‌రావు, స్టీఫెన్‌సన్‌ ఓ రహస్య ప్రదేశంలో సమావేశమైంది వాస్తవం కాదా? ఈ భేటీలోనే చంద్రబాబుపై రాజకీయ కుట్రకు తెరదీసింది వాస్తవం కాదా?
* స్టీఫెన్‌సన్‌కు ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని గతంలో జగన్‌.. కేసీఆర్‌కు లేఖ రాసిన మాట నిజం కాదా?
*కేసీఆర్‌తో కలిసి జగన్‌ గూడుపుఠాణి చేయడం ఏపీ ప్రజలకు ద్రోహం చేయడం కాదా?
* టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందా లేదా? రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేసిన కేసీఆర్‌ ట్యాపింగ్‌ వ్యవహారం బయటపడ్డాక రాజీనామా ఎందుకు చేయలేదు?
* ఫోన్‌ ట్యాపింగ్‌కు వాడిన పరికరాలు ఎక్కడివి?
* ఫోన్‌ ట్యాపింగ్‌ మాట వాస్తవమేనని తెలంగాణ హోం మంత్రి నాయిని చెప్పింది వాస్తవం కాదా? ఇదే విషయాన్ని హరీశ్‌రావు, కడియం శ్రీహరి ధ్రువీకరించింది వాస్తవం కాదా?
* ట్యాపింగ్‌ వ్యవహారం బయటపడ్డాక తాము ట్యాపింగ్‌ చేయలేదని ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌తో హడావిడిగా ఖండన ఇప్పించడం వాస్తవం కాదా?
*హోం మంత్రి మాట వాస్తవమా, ఏసీబీ డీజీ మాట వాస్తవమా?
*ఏసీబీ డీజీ, టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడలేదని రాతపూర్వకంగా ఇవ్వగలరా?
* ఫోన్‌ ట్యాపింగ్‌ చేయకపోతే ఏపీ సీఎం మీద కేసు పెడతామనడం రాజకీయంగా బద్‌నామ్‌ చేయడం కాదా? ఇది కుట్రలో భాగం కాదా?
* టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తోంది? ఫోన్‌ ట్యాపింగ్‌ కానీ, ఫోన్‌ రికార్డింగ్‌ కానీ నేరం కాదా?
* చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్న రికార్డింగ్‌ వెర్షన్‌ కానీ, ఫోన్‌ ట్యాపింగ్‌ వెర్షన్‌ కానీ వైసీపీకి లేదా సాక్షి పత్రికకు ఎక్కడి నుంచి వచ్చాయి?
* స్టింగ్‌ ఆపరేషన్‌ చట్టసమ్మతం కాదని సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏసీబీకి తెలియదా? స్టింగ్‌ ఆపరేషన్‌కు చట్టబద్ధత లేదని తెలిసినా దాన్ని ఆధారంగా చేసుకుని కేసు ఎలా పెడతారు?
* స్టీఫెన్‌సన్‌ ఇంట్లో ముందుగానే కెమెరాలు అమర్చడంలో ఎవరి పాత్ర ఉంది. ఇది రాజకీయ కుట్ర కాదా?
* ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత ఏ రకమైన ఉల్లంఘనలైనా ప్రజాప్రాతినిధ్య చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ విషయం ఏసీబీకి తెలియదా? ఏసీబీ ఈసీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు?

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yanamala Ramakrishnudu  Jagan  stephenson  Harish Rao  Revanth Arrest  KCR  

Other Articles