R Ashwin strike thrice against Bangladesh after rain

India bangladesh match delayed due to rain in mirpur

Bangladesh, India, Shere Bangla National Stadium, Mirpur, Ind vs Ban, 2015, Bangladesh,India, Mirpur, Ind vs Ban, 2015, Cricket, Live Cricket Score, Live Score India vs Bangladesh, 1st ODI in Mirpur - Live Score latest Ind vs Ban, 2015 news

A rain interruption forced the match to halt but R Ashwin struck thrice after the rain-break to put Indian back in the game

నాలుగో విక్కెట్లు కోల్పోయి.. ధీటుగా రాణిస్తున్న బంగ్లాదేశ్

Posted: 06/18/2015 05:44 PM IST
India bangladesh match delayed due to rain in mirpur

భారత్తో అతిధ్య జట్టు బంగ్లాదేశ్ తో మిర్పూర్ వేదికగా షేరే బంగ్లా స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత్ బౌలర్లు బంగ్లా అటగాళ్లను కట్టడి చేస్తున్నారు. టీమిండియా బౌలర్ల ధాటికి 32 ఓవర్లలో నాలుగు విక్కట్ల నష్టానికి బంగ్లాదేశ్ 189 పరుగలు చేసింది. 13 ఓవర్ల వరకు ధీటుగా ఆడిన బంగ్లాదేశ్ భారత బౌలర్లకు చమటలు పట్టించారు. ఆ తరువాత కొలుకున్న దోని సేన బంగ్లాదేశ్ ను కట్టడి చేసింది. 102 పరుగల వద్ద సౌమ్య సర్కార్ ను సురేష్ రైనా రనౌట్ చేయడంతో భారత తొలి వన్డేలో పట్టు బిగించింది.

54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సౌమ్య సర్కార్ వెనుదిరగగా, 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తకీమ్ ఇక్బాల్ పెవిలీయన్ చేరాడు. లిట్టన్ దాస్ కేవలం ఎనమిది పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బాలింగ్ లో వెనుదిరిగావు. ఆ తరువాత ముషాఫికుర్ రహీమ్ 14 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద వెను దిరిగాడు. వర్షం రావడం ఆశ్విన్ కు కలసివచ్చింది. మ్యాచ్ లో ఇప్పటి వరకు ఆయన మూడు విక్కెట్లను పడగోట్టాడు. మ్యాచ్ మధ్యలో వరుణుడు కొంత సేపు అడ్డంకిగా నిలవడంతో అంపైర్లు తాత్కాలికంగా కొంత సేపు మ్యాచ్ ను నిలిపివేశారు.

ఆ తరువాత భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సహా లిట్టన్ దాస్ వికెట్లను తీయండో భారత్ దూకుడు పెంచింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 146గా వుంది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన ధోనిసేనకు ధీటుగా సమాధానం ఇచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh  India  Shere Bangla National Stadium  Mirpur  1st ODI  

Other Articles