ap cs Krishnarao to brief phone tapping issue to union Home ministry

Ap cs krishnarao to meet union home ministry

ap cs krishnaRao to meet union Home ministry, andhrapradesh cheif secratary Krishnarao, union Home ministry, evidences, phone tapping issue, AP Dgp Ramudu

andhrapradesh cheif secratary Krishnarao to brief phone tapping issue to union Home ministry, and give evidences in the same.

కేంద్ర హోం శాఖకు సాక్ష్యాలు అందించనున్న ఏపీ సీఎస్

Posted: 06/18/2015 05:04 PM IST
Ap cs krishnarao to meet union home ministry

ఓటుకు నోటు కేసు బయటపడేందుకు కారణమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపి ప్రభుత్వం కేంద్ర దృష్టికి తీసుకువెళ్లనుంది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, కేంద్ర హోం శాఖ అపాయింట్ మెంట్ ను కోరినట్లు సమాచారం. కాగా ఇవాళ సాయంత్రం ఏఫీ డిజీపీ రాముడు కూడా హస్తినకు వెళ్లనున్నారు. ఢిల్లీలో ఏపీ సీఎస్‌, డీజీపీలు కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసి ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలను అందజేయనున్నారు. సెక్షన్‌ -8 ను అమలు చేయాలని వారు కేంద్ర కార్యదర్శిని కోరనున్నట్లు సమాచారం.

కాగా, ఈ వ్యవహారంలో కేంద్రానికి తెలియజేయాల్సిన అంశాలను, ఏపీ అభ్యంతరాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో ఏపీ డీజీపీ రాముడు ఇవాళ ఉదయం బాబు నివాసంలో భేటీ అయ్యి చర్చించినట్లు సమాచారంరు. ఫోన్ ట్యాపింగ్ సహా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై నమోదైన 88 కేసుల వివరాలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు చంద్రబాబుతో టీడీపీ సీనియర్‌ నేతలు గరికపాటి, నామా నాగేశ్వరరావు సమావేశమయ్యారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap cs Krishnarao  phone tapping issue  union Home ministry  

Other Articles