ys jagan | revanth case | vote to note case | YSRCP | YSR congress

Ysjaganmohan reddy went jerusalem for tour

ys jagan, revanth case, vote to note case, YSRCP, YSR congress

YSJaganmohan Reddy went Jerusalem for tour. In telugu states major issues going on, but YSRCP leader Jagan was missing from past four five days.

జగన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా..?

Posted: 06/18/2015 02:51 PM IST
Ysjaganmohan reddy went jerusalem for tour

అవు.ను ఓటుకు నోటు, ట్యాపింగ్ వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయి ఓ విషయాన్ని మరిచిపోయారు. చంద్రబాబు నాయుడు .పేరు చెబితే ఒళ్లంతా దద్దుర్లు వచ్చిన వారిలాగా జగన్ ఎంత ఎత్తుకు లేస్తాడో అందరికి తెలుసు. ఎప్పుడూ యాత్రల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో టూర్లు వేసే జగన్ తన ప్రతి ప్రసంగంలో చంద్రబాబు నాయుడు పేరెత్తకుండా మాట్లాడరు. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ.. కష్టాల్లో ఉన్నారు. ఏదో చిన్నా చితకా వ్యవహారం కూడా కాదు ఏకంగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోస్ట్ కే ఎసరుపెట్టేంత పెద్ద ఇష్యూ అయినా ఏపిలో దాని గురించి ప్రశ్నించాల్సిన ఓ గొంతు మాయమైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో చంద్రబాబు నాయుడు మీద యుద్దానికి ఎప్పుడూ సిద్దంగా ఉండే జగన్ ఇప్పుడు వార్తల్లో లేకుండా పోయారు. మొత్తానికి జగన్ బాబుగారు కనిపించడంలేదు. ఎవరూ ఫిర్యాదు చెయ్యడం లేదు కానీ ఇది నిజం.

ఓటుకునోటు వ్యవహారంపై ప్రధానప్రతిపక్షం నానాయాగీ చేస్తుందనే అంతా అనుకున్నారు. కానీ వైసీపీ అధినేత రాష్ట్రంలో ఒక రోజు చంద్రబాబు దిష్టి బొమ్మల దహనానికి పిలుపు ఇచ్చారు. అంతే... అంతకు మించి ఒక్క కార్యక్రమాన్ని జగన్ పార్టీ చేయలేదు. చేయలేదు అనే కంటే జగన్ చేయించలేదని అనుకోవాలి. ఎందుకంటే జగన్‌ కనుసైగ చేయందే పార్టీలో ఏ కార్యక్రమం కూడా అడుగుముందుకేయదు. వెంట జనం రాకున్నా,  అసెంబ్లీలో సింగిల్‌ సీటు లేకున్నా ఏపీ కాంగ్రెస్ ఉన్న కొద్ది మందితో చంద్రబాబుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో దీక్ష చేసి అందరి దృష్టిలో పడింది. కానీ 67 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ..ఇంత పెద్ద ఎపిసోడ్ లో అడ్రస్ లేకుండాపోయింది. ఇంత సీరియస్ గా రాజకీయాలు జరుగుతుంటే... జగన్ జెరూసలెం పర్యటనకు వెళ్లడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు నాయకులు. చంద్రబాబు ఇబ్బందుల్లో ఉంటే.. బలపడాల్సిన వైసీపీ బలహీనమైందనే వాదన కూడా వినిపిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారంతోపాటు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చి ఏపీకి వైసీపీ ద్రోహం చేసిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వీటిని కూడా తిప్పికొట్టే పరిస్థితి పార్టీలో కనిపించకపోవడం విశేషం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan  revanth case  vote to note case  YSRCP  YSR congress  

Other Articles