GHMC issues property tax notices to Ap secretariat in hyderabad

Ghmc issues notices to ap secretariat

GHMC issues property tax notices to Ap secretariat, hyderabad, Telangana Government, property tax notices, Ap secretariat, chandrababu naidu, Greater Hyderabad Muncipal corperation,

Greater Hyderabad Muncipal corperation issues property tax notices to Ap secretariat in hyderabad

ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి నోటీసులు

Posted: 06/18/2015 01:15 PM IST
Ghmc issues notices to ap secretariat

ఓటుకు నోటు కేసుతో ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, అధికార పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో.. ఉమ్మడి రాజధానిలో వున్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆస్తి పన్ను కూడా మరో వివాదానికి కారణమైయ్యింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలు పలు వివాదాలతో సతమతమవుతున్న తరుణంలో తాజాగా ఆస్తి పన్ను వివాదం అటు రెండు రాష్ట్రాల అధికారులను కూడా వివాదంలోకి లాగుతోంది. హైదరాబాద్ లో వున్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆస్తి పన్ను బకాయిల విషయమై ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ కమీషనర్ సచివాలయానికి నోటీసలు జారీ చేశారు.

గత ఏడాది కాలంగా ఆస్తి పన్నులను ఆంద్రప్రదేశ్ ఫ్రభుత్వం చెల్లించలేదని పేర్కోంటూ.. జీహెచ్ఎంసీ కమీషనర్ సోమేష్ కుమార్ ఈ నోటీసులను జారీ చేశారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూ.22 కోట్ల మేర బకాయిలు చెల్లించలేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గురువారం ఈ నోటీసులు జారీ చేసింది. బకాయిలను వెంటనే చెల్లించాలని సూచించింది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ బకాయిల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు జూబ్లీహిల్స్ లోని నివాస పునర్ నర్మిణానికి కూడా జీహెచ్ఎంసీ కమీషనర్ అనుమతి ఇవ్వలేదని, ఆయన కమీషనరా..? లేక టీఆర్ఎస్ కార్యకర్తా అని టీడీపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో నోటీసులను జారీ చేయడం గమనార్హం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  property tax notices  Ap secretariat  hyderabad  

Other Articles