nara lokesh | note for vote, Chandrababu

Nara lokesh comments on cash for vote case and telangana cm kcr

nara lokesh, note for vote, revanth reddy, Chandrababu

Nara lokesh comments on cash for vote case and telangana cm Kcr. He said that chasndrababu doing delhi level politics, but Kcr doing street level politics.

ITEMVIDEOS: ఓటుకు నోటు కేసులో లోకేష్ గేమ్

Posted: 06/17/2015 08:03 AM IST
Nara lokesh comments on cash for vote case and telangana cm kcr

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకుంటున్న ఓటుకు నోటు కేసుపై మొదటిసారిగా నారా లోకేష్ స్పందన తెలిసింది. పార్టీ ప్రస్తుతం నెంబర్ టు గా ఎదుగుతున్న నారా లొకేష్ ప్రస్తుతం ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సంబందించిన ముదురుతున్న ఓటుకు నోటు వ్యవహారంపై మాట్లాడారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు స్థాయిని చెబుతూ మాట్లాడటం విశేషం. అయితే తన మాటల్లో తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏంటో తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ కు తగిన విధంగా జవాబు ఇవ్వాలని ఏపి ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దమైందని లొకేష్ మాటల ద్వారా స్పష్టమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన గేమ్ ఆయన ఆడతారని, మన గేమ్ మనం ఆడతామని అన్నారు. మొత్తానికి ఎవరి గేమ్ వారిదే అంటూ చేసిన వ్యాఖ్య చర్చకు దారితీసింది. అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయి రాజకీయాలు చేస్తుంటే కేసీఆర్ మాత్రం గల్లీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అయినా ఇంత కాలంగా మాట్లాడని నారా లోకేష్ ఇప్పుడు మాట్లాడటం ఏంటని కూడా కొంత మంది ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు చాణిక్యమే అంటున్నారు. కీలక సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో మాట్లాడటం పెద్దగా ప్రయోజనం కలిగించదని చంద్రబాబు నీతిని ఫాలో అవుతున్నారని దగ్గరి వారు అంటున్నారు. మొత్తానికి ఓటుకు నోటు కేసుపై, చంద్రబాబు నాయుడు ఔనత్యంపై నారా లోకేష్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  note for vote  revanth reddy  Chandrababu  

Other Articles