maggi | nestle | india

Maggi noodles loss nearly 320 crore

320 crores, maggi, destroyed, nestle, Nestle india, Maggi instant noodles, central food safety regulator (FSSAI), , lead, monosodium glutamate (MSG), withdrawing the stock of Maggi, BSE. broad , Estimate

Maggi noodles loss nearly 320 crore. The nestle company conformed that By prohibition of Maggi noodles, the company lost 320crore.

ఇండియా దెబ్బకు నెస్లే అబ్బా.. మ్యాగీ నష్టం 320కోట్లు

Posted: 06/16/2015 08:31 AM IST
Maggi noodles loss nearly 320 crore

మ్యాగీ నూడిల్స్‌పై నిషేధంతో నెస్లే ఇండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓవైపు బ్రాండ్ వాల్యూ దెబ్బతింటే... మరోవైపు ఆర్ధికంగా కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొటోంది. సీసంతో పాటు విషపూరిత పదార్ధాలు ఉన్న మ్యాగీ నూడిల్స్‌ను నిషేధించడంతో వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించకుంది నెస్లే. దాదాపు రెండు వందల పది కోట్ల విలువైన ఉత్పత్తులను నెస్లే కంపెనీ ధ్వంసం చేసింది. మరో 110 కోట్ల విలువైన మ్యాగీ నూడుల్స్, తయారీ సరుకు ఫ్యాక్టరీల వద్ద ఉండిపోయింది. వాటిని కూడా ప్రాసెస్ చేయకుండా నిలిపి వేశారు.

మ్యాగీ వివాదం నెస్లే ఇండియా కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. మ్యాగీ పై వచ్చిన ఆరోపణల నుంచి మార్కెట్ల నుంచి ఉత్పత్తులను  ఉపసంహరించుకోవడం వరకూ అన్ని వివరాలను నెస్లే కంపెనీ స్టాక్ ఎక్సేంజ్‌కు తెలిపింది. ప్రస్తుతానికి 320 కోట్ల నష్టం చవిచూశామని... నిషేధిత నూడుల్స్‌ను ధ్వంసం చేసేందుకు అయిన ఖర్చు అదనమని తెలిపింది.మూడు దశాబ్దాలుగా భారత మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా ఉన్న నెస్లే ఇండియాకు  మ్యాగీ రూపంలో పెద్ద దెబ్బ తగలడంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది కంపెనీ. భారత ఆహార ఉత్పత్తుల ప్రమాణాల ప్రకారం మ్యాగీని తయారు చేసి మార్కెట్లలోకి విడుదల చేసేందుకు నెస్లే  ప్రయత్నాలు చేస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles