Telangana, Excise, KCR, Liquior, Cheapliquior

Telangana govt decided to supply cheap liquor at low cost

Telangana, Excise, KCR, Liquior, Cheapliquior

Telangana govt decided to supply cheap liquor at low cost. Govt propose to spuly quarter liquior by thirty rupees only.

ప్రభుత్వం వారి పెగ్గు కేవలం 5 రూపాయలే..!

Posted: 06/16/2015 08:02 AM IST
Telangana govt decided to supply cheap liquor at low cost

ఈ వార్త మందుల బాబులకు చాలా మంచి వార్త. రోజు వార్తల్లో వచ్చే వాళ్లకు పనికి రాని వార్తల కన్నా ఈ వార్త మాత్రం వాళ్లకు ఎంతో అవసరం. ఏంటీ అంటారా..? తెలంగాణ ప్రభుత్వం తాజాగా మందుల బాబుల కోసం  నిర్ణయం తీసుకుంది. అదే గనక అమలు అయితే పెగ్గు మందు కేవలం ఐదు రూపాయలు మాత్రమే. క్వార్టర్ కేవలం 30 రూపాయలు మాత్రమే. ఇంకేముందు మందు తక్కువ రేటుకు వస్తే మందుబాబులు ఊరుకుంటారా..? కేసీఆర్ పేరు చెప్పుకొని ఓ నాలుగు పెగ్గులు పూటుగా తాగి పడుకుంటారు. అయితే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల వేరే కారణం ఉంది. గుడుంబాకు చెక్‌ పెట్టేలా.. ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయం పెరిగేలా ద్విముఖ వ్యూహంతో ఈ విధానం ఉండాలని టీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి తగ్గట్టు చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రస్తుతం ఉన్న మందు దుకాణాలను డబుల్ చేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. నిజానికి సారాను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ముందు అనుకున్నా.. మహిళా సంఘాల నుంచి నిరసనలు ఎదుర్కోవలసి వస్తుందనే భయంతో దానిని పక్కనపెట్టింది. దాని స్థానంలో సారా బదులు స్థానికంగా తయారు చేసిన చీప్‌ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ప్రస్తుతం గుడుంబా విక్రయించే ప్రాంతాల్లోనే ఈ చీప్‌ లిక్కర్‌ దుకాణాలకు లైసెన్సులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా, 180 మిల్లీ లీటర్ల చీప్‌ లిక్కర్‌ను 30రూపాయలకు, 90 మిల్లీ లీటర్లు 15రూపాయలకు లేదా 20రూపాయలకు చొప్పున అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు రూపొందించినట్టు సమాచారం. జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వనున్నారు.దాంతో ప్రస్తుతం ఉన్న 2,216 మద్యం దుకాణాలకు అదనంగా మరో రెండు వేల దుకాణాలు అందుబాటులోకి రావొచ్చు. ఇకనుంచి తెలంగాణలో గుడుంబా లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం పేదల కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, కానీ, గుడుంబా మహమ్మారి కారణంగా వారిలో సంతోషం కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ఆబ్కారీ విధానం ఖరారు చేసే క్రమంలో గుడుంబాను అరికట్టడమే ప్రధాన అంశంగా ఉండాలని తేల్చి చెప్పారు. అయినా మందు బాబులకు ఏదైతే ఏముంది.. గుడుంబా అయినా
సారా అయినా ఆఖరుకు చీప్ లిక్కరైనా ఒక్కటే మరి కేసీఆర్ సారు దీన్ని ఎప్పుడు గుర్తిస్తారో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Excise  KCR  Liquior  Cheapliquior  

Other Articles