Petrol price hiked by 64 paise/ litre, diesel price cut by Rs. 1.35

Petrol price hiked by 64 paise a litre diesel price cut by rs 1 35

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, crude oil prices, international oil markets, barrel crude oil price, barrel crude oil prices in indian currency

The government today hiked petrol prices by 64 paise a litre, the third straight increase in just two months. On the other hand diesel price has been cut by Rs 1.35 per litre.

వాహనదారులకు చేదు వార్త.. పెరిగిన పెట్రోల్ .. తగ్గిన డీజిల్ ధరలు

Posted: 06/15/2015 08:01 PM IST
Petrol price hiked by 64 paise a litre diesel price cut by rs 1 35

యూపీఏ హయాంలో పెరగడమే తప్ప తరగడం తెలియక పైపైకి ఎగబాకిన చమురు ధరలు అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలతో గత ఏడాది జూలై మాసం నుంచి కిందకు దిగివచ్చినట్లే వచ్చి.. తాజాగా మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. వాహనదారుల చేదుగుళిక లాంటి వార్తనందిస్తూ.. వారి జేబులకు చిల్లులు పెడుతూ.. పెట్రోల్ ధర మళ్లీ పైకి ఎగబాకింది. రెండు నెలల వ్యవధిలో మూడో పర్యాయం పెట్రోల్ ధర పైకి ఎగబాకింది. అయితే మరోవైపు డీజిల్ ధరలు మాత్రం కిందకు దిగివచ్చాయి.

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెంపు కోసం కాచుకు కూర్చున్న చమురు సంస్థలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. లీటరు పెట్రోలు ధర 64 పైసలు పెంచుతున్నట్లు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. కాగా, డీజిల్ ధర మాత్రం రూ. 1.35 తగ్గింది. పెంచిన ధరలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. రెండు వారాల కిందటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా పెంపు నిర్ణయం వినియోగ దారులకు మరింత భారం కానుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  Diesel  Fuel  Omc  Petrol price per litre  IOC  Crude oil  

Other Articles