FIR filed against Rajinikanth's wife Latha in forgery case

Forgery case on rajinikanth wife latha in bangalore

Forgery case on Rajinikanth wife latha in bangalore, Rajinikanth, Latha Rajinikanth, forgery case, Rajnikanth wife, latha, case filed on latha rajinikanth, kochadaiyaan, Bengaluru, police, FIR, Latha Rajinikanth, wife, Rajnikanth, fake documents

Bengaluru police on Monday lodged an FIR against Latha Rajinikanth, wife of Tamil Superstar Rajnikanth, for allegedly producing fake documents in court to get gag order on media.

రజనీకాంత్ సతీమణి లతపై బెంగళూరులో ఫోర్జరీ కేసు

Posted: 06/15/2015 07:08 PM IST
Forgery case on rajinikanth wife latha in bangalore

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబానికి కొచ్చాడయాన్ వరుస సినిమాకష్టాలు తప్పడం లేదు.  ఈ సినిమా వ్యవహారంలో రజనీకాంత్ భార్య లత మీద బెంగళూరు నగర పోలీసులు.. న్యాయస్థానం అదేశం మేరకు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రూపొందించారు. కోర్టులో నకిలి లెటర్ హెడ్ ఇచ్చి, వంచన చేశారని అమెపై పోలీసులు ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా బెంగళూరు పోలీసులు లత రజనీకాంత్ ను విచారించనున్నారు. రజనీకాంత్ నటించిన కోచ్చాడియన్ సినిమా విడుదల సందర్బంలో ఈ సినిమా హక్కులను ఒకరికి తెలియకుండా మరోకరికి మొత్తంగా ఇద్దరికి విక్రయించారనిమీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్నాయి.

ఆ సందర్బంలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చెయ్యరాదని, ప్రచురించరాదని లతా కోర్టును ఆశ్రయించారు. బెంగళూరు లోని కోర్టు ఇలాంటి కథనాలు ప్రచురించరాదని, ప్రసారం చెయ్యరాదని స్టే ఆర్డర్ (గాగ్ ఆర్డర్) జారీ చేసింది. చెన్నయ్ కోర్టులోనూ లతా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. తరువాత వార్తలు బయటకు రాలేదు. ఆ సమయంలో లతా రజనీకాంత్ ఆడ్ బ్యూరో పేరుతో కోర్టుకు సమర్పించిన లెటర్ హెడ్ నకిలీదని వెలుగు చూసింది.

కోచ్చాడియన్ సినిమాను మీడియా ఒన్ ఎంటర్ టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో నిర్మించారు. దీంతో బెంగళూరు మెట్రో పాలిటిన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఈనెల 9న లతా రజనీకాంత్ పై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చెయ్యాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బెంగుళూరు నగర పోలీసులు అమెపై కేసు నమోదు చేశారు.కొచ్చాడయాన్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై వివాదం కొనసాగుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Latha Rajinikanth  forgery case  

Other Articles